క్రేజ్ తగ్గని పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’

పంజా సినిమా చూసాకా ఎక్కడ లేని నిరుత్సాహం ఆవరించింది. దానికి కారణం కథను నమ్మి కాకుండా, పవన్ కళ్యాణ్ దగ్గర నుండి ప్రేక్షకులు ఏమి ఆశీస్తున్నారో తెలియని ఒక దర్శకుడి మీద భారం వేసాడని.

‘తీన్ మార్’ ప్రేక్షకాదరణ పొంద లేకపోయినా నాకు నచ్చింది కారణం పాత ‘పవన్ కళ్యాణ్’ మైఖల్ వేలాయుధం ఉత్సాహంతో పాటు, అర్జున్ పల్వాయ్ గా పవన్ కళ్యాణ్ ఇరగదీసేసాడు. అదే ఊపులో పంజా కూడా కంటీన్యూ చేస్తూ మంచి కథ, ఇంటరెస్ట్ గా చెప్పే మంచి దర్శకుడిని ఎన్నుకుంటాడు అనుకుంటే నిరాశే మిగిలింది.

సినిమా పబ్లిసిటీ అంటే ఎటువంటి సినిమా ఎక్సపేట్ చేయవచ్చో ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం. ఒక సినిమా ఎన్ని అభ్యదయ భావాలతో నిర్మించినా, నిర్మాతకు చివరకు కనిపించేది ఆ సినిమాకు అయిన ఖర్చు. ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం పక్కన పెట్టి, ప్రేక్షకులు రావడమే ధ్యేయంగా పబ్లిసిటీ చేయబడుతుంది. పంజా సినిమాలై అసలు ఎటువంటి అంచనాలు లేని స్థాయి నుంచి, సినిమాపై ఉవ్వేత్తున అంచనాలు క్రియేట్ చేసిన ఘనత నిర్మాత నీలిమ తిరుమల శెట్టి గారిదే. పబ్లిసిటీని తప్పు పట్టడం కాదు కాని, సినిమాను హైప్ చేయడమే ధ్యేయంగా పంజా పబ్లిసిటీ జరిగింది. పబ్లిసిటీలో అభిమానులను కూడా భాగం చేసి సినిమాపై మరింత ఇంటరెస్ట్ క్రియేట్ చేసి, చివరికి ఒక స్లో యాక్షన్ మూవీ ఇచ్చారు.

‘గబ్బర్ సింగ్’ సినిమాను మొదటి రోజు నుంచి దర్శక నిర్మాతలు హైప్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే వున్నారు. వారి అలుపెరగని(more of హరీష్ శంకర్) ప్రయత్నం ఫలించందని చెప్పవచ్చు. దానికి కారణం టీజర్, టీజర్ లోని డైలాగ్ ఫ్యాన్స్ కోరుకున్న దానికంటే ఎక్కువగా వుండటమే. టీజర్ చూసాక, దబాంగ్ కథలో హరీష్ శంకర్ చేసిన మార్పులు తెలుగు ప్రేక్షకులు మెచ్చుకుంటారనే అనిపిస్తుంది.

కమర్షియల్ ఫ్లాప్స్ తో నిరుత్సాహ పడకుండా, మరింత ఉత్సాహంతో పని చేస్తున్న పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే, మనం నేర్చుకోవల్సింది చాలా వుందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ ఇచ్చిన అవకాశంతో మాటలే కాదు, చేతల్లో చూపించే దర్శకుడిగా మంచి పేరు వచ్చి, స్టార్ దర్శకుడిగా హరీష్ శంకర్ ఎదగాలని ఆశీద్దాం.

Ramesh ‏ @Ramesh_says
@ssrajamouli Hindi remakes ikkada aadatledu mari GS meeda mee opinion..?

rajamouli ss rajamouli ss ‏ @ssrajamouli
@Ramesh_says I don’t base my estimations on what happened in past.either +ve or -ve.harish Shankar is quite capable of exploiting PK’s image

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.