ఈగ పబ్లిసిటీ మొదలైంది


ఎంత పెద్ద హిరో అయినా, ఎంత పెద్ద దర్శకుడు అయినా పబ్లిసిటీ చాలా అవసరం.

“పబ్లిసిటీ అంటే మా సినిమా నుంచి ఈ అంశాలు ఎక్సపేట్ చెయ్యండి” అని ప్రేక్షకులను ప్రిపేర్ చేయడం.

సినిమాలో ప్రాముఖ్యత లేని అంశాలతో సినిమా రిలీజ్ కు ముందు సినిమాపై అంచనాలు పెంచే విధంగా పబ్లిసిటీతో సినిమాను హైప్ చేయడం మరో రకమైన పబ్లిసిటీ. ఒక కోణంలో మోసం అనిపించినా , ఈ రకమైన పబ్లిసిటీని తీసిపారేయలేం .

ఏ సినిమాకైనా సిన్సియర్ ప్రయత్నం అవసరం. ఆ సిన్సియర్ ప్రయత్నం, క్రియేటర్ కు “ప్రేక్షకులను మెప్పించాలి” అయ్యి వుండాలి తప్ప బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని కాదు.

రాజమౌళి కథతో వెళితే ఏ పెద్ద హిరో అయినా ‘నో’ అనని పరిస్థితులలో(can earn so much money), ‘ఈగ’ చేయడం ఒక ఎత్తు అయితే, ‘ఈగ’ సినిమా కోసం ఒక సవంత్సరం పైనే కష్టపడ్డాడు. సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో, పబ్లిసిటీ కోసం కూడా అంతే కేర్ తీసుకోవడం రాజమౌళి ప్రత్యేకత.

‘మగధీర’ ఆడియో ఫంక్షన్ తో సినిమాపై అంచనాలు మొదలయినాయి. ఇప్పుడు అదే బాటలో ‘ఈగ’ కూడా అంచనాలు క్రియేట్ చేయగల్గితే భారీ ఓపినింగ్స్ ఖాయం.

ప్రతి సినిమా ప్రేక్షకుల అంచనాలు రీచ్ అవ్వాలని రూల్ లేదు, అవుతుందని గ్యారంటీ లేదు. అంచనాలు రీచ్అయితే మాత్రం ‘ఈగ’ సంచలనాలు సృష్టించడం ఖాయం.

bottomline:
“ప్రేక్షకులను మెప్పించాలి” అన్న రాజమౌళి సిన్సియర్ ప్రయత్నం కోసం, మొదటి రోజే చూడాలని నిర్ణయించుకున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.