రచ్చ సినిమా “వంశం” సినిమానేమోనని భయపడుతున్న మెగా అభిమానులు

పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్న తర్వాత, గౌరవం/కృతజ్ఞ్జతతో చిరంజీవిని రిఫర్ చేయడం జరుగుతుంది తప్ప, అనవసరంగా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేసి, ఆ ఇమేజ్ తో సినిమాను ఆడిచ్చేద్దాం అని ప్రయత్నం ఎప్పుడూ చెయ్యలేదు. మొన్న పంజా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ ఇంకో అడుగు ముందుకు వేసి, అభిమానిస్తే నన్ను నన్నుగా అభిమానించండి తప్ప , చిరంజీవి తమ్ముడిగా నన్ను అభిమానించ వద్దు అని చెప్పాడు.

పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎప్పటికి మరచిపోడు. తనకంటూ ఒక ఇమేజ్ లేకుండా ఎల్లప్పుడూ అదే షాడో వుండటం తనకే కాదు, ఎవరికీ ఇష్టం వుండదు. అదృష్టవశాత్తు ఆ ఇమేజ్ నుంచి చాలా తొందరగా బయటకు వచ్చి తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకో గల్గాడు.

పవన్ కళ్యాణ్ లా ‘రామ్ చరణ్’ కూడా చిరంజీవి కొడుకుగా కాకుండా, తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకోవాలని చాలామంది మెగా అభిమానులు కోరుకుంటున్నారు. దానికి కారణం నందమూరి హీరోల సినిమాలలో వచ్చే వంశం డైలాగ్స్, స్వర్గీయ ఎన్.టి.ఆర్ రిఫరెన్స్ డైలాగ్స్ కావలసిన దానికి మించి వుంటాయని మెగా అభిమానులు విమర్శలు చేసి వున్నారు కాబట్టి. రచ్చ సినిమాలో ‘గ్యాంగ్ లీడర్’ పాటతో పాటు, “కొణదల వారి కొడుకా” అనే లిరిక్స్ మెగా అభిమానులను బాగా కలవర పరుస్తున్నాయి.

కొందరు మెగా అభిమానులు అలా వర్రీ అవుతుంటే, కొందరు మెగా అభిమానులు మాత్రం “మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చెయ్యడం ద్వారా మాస్ అభిమానులను ఆకట్టుకోవడం ఈజీ”, చిరంజీవి కొడుకు చిరంజీవి ఇమేజ్ ఉపయోగించుకుంటే తప్పేంటి అంటున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.