రాజమౌళితో సినిమా కోసం .. హీరోల కోసం రాజమౌళి ..

తెలుగు ప్రేక్షకుల దృష్టిలో మగధీరకు ముందు రాజమౌళి వేరు. మగధీర తర్వాత రాజమౌళి వేరు. కేవలం మాస్ డైరక్టర్ గా ముద్రగా పడిన రాజమౌళి మగధీరతో యూనివర్సల్ డైరక్టర్ గా మారిపోయాడు. తన మాస్ మార్క్ కంటీన్యూ చేస్తూనే, మగధీరతో వచ్చిన యూనివర్సల్ క్రేజ్ ను నిలబెట్టుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాడు.

స్టార్ హిరో లేకుండా, సింపుల్ రివెంజ్ స్టోరితో తెలుగు ప్రేక్షకులందరూ తన సినిమా కోసం ఎదురు చూపులు చూసే స్థాయికి వచ్చిన ఏకైన దర్శకుడు రాజమౌళి.

మాతో సినిమా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు అని పబ్లిక్ గా నాగార్జున, ఎన్.టి..ఆర్ లు రాజమౌళిని చావగొడుతున్నా, రాజమౌళి మాత్రం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల కోసం ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది.

ఈగ తర్వాత రాజమౌళి చేయబోతున్న సినిమాకు హిరో ప్రభాస్.

ఆ సినిమా తర్వాత ఏ హీరోతో కమిట్ అవుతాడో, ఆ తర్వాత నాతో ఎప్పుడు చేస్తాడో అని మొన్న ఈగ ఆడియో ఫంక్షన్ లో ఎన్.టి.ఆర్ తన అసహనాన్ని వ్యక్తపరచగా: నేను రాజమౌళితో సినిమా చెయ్యాలనుకుంటున్నాను ఆ సినిమాలో నటించడం తప్ప మరో విధంగా ఇన్వాల్వ్ కాను అని ఆ ఫంక్షన్ లోనే నాగార్జున చెప్పాడు. (రాజమౌళి తన సినిమాలో ఎవరినీ, ఏ విషయాలలోనూ వేలు పెట్టనివ్వడు అంట)

ఏది ఏమైనా, ఒక దర్శకుడికి ఇంత క్రేజ్ రావడం నిజంగా రాజమౌళి సంపాదించుకున్న పెద్ద గౌరవం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.