‘ఈగ’ ట్రైలర్ రివ్యూ

ప్రపంచంలో పని పాట లేని వాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది. ఒకప్పుడు అరుగుల మీద కూర్చుని, వూళ్ళో ఆడి గురించో వీడి గురించో వున్నవి లేనివి చెప్పుకోవడం చూసాం. ఈనాటి హైటెక్ యుగంలో కూడా అది కంటీన్యూ అవుతుంది. ఆర్కట్ లోనో ఫేస్ బుక్ లోనో మనకు నచ్చని వాళ్ళపై కామెడీ చేయడం, పది మందికి ఫార్వార్డ్ చెయ్యడం. బయట ఫ్రెండ్స్ తోనూ వాటి గురించే చర్చలు. For me, అటువంటి వాటిపై ఖాళీ టైం స్పెండ్ చేసే కంటే, ఇటువంటి పై చేయడం బెటర్ అని నా ఉద్దేశం.ఇటువంటివి కూడా మీరు వేస్ట్ అనుకుంటే better stop reading further.

పబ్లిసిటీ అంటే ప్రేక్షకుడిని ప్రిపేర్ చెయ్యడం. మగధీర సినిమా నుంచి పబ్లిసిటిలో భాగంగా మొత్తం కథ చెప్పేస్తున్నాడు రాజమౌళి. it worked both ‘మగధీర’ & ‘మర్యాద రామన్న’.

రాజన్న సినిమాకు మాత్రం దేబ్బెసింది. రాజన్న సినిమా కాస్టింగ్ ప్రోబ్ల్మం తప్ప పబ్లిసిటి లోపం కాదు.

‘ఈగ’ ట్రైలర్ లో మొత్తం కథ చెప్పడం కాదు, చూపించేసాడు. ఇక మిగిలింది ఇప్పుడు రెండు నిమషాల ట్రైలర్ లో చూపించింది, రెండున్నర గంటల పాటు సాగదీసి ప్రేక్షకుడిని ఎలా కూర్చోపెడతాడని. నిజంగా కత్తి మీద సామే.

ఒక మనిషి చచ్చిపోయాక ఈగగా పుట్టి, తన శత్రువులపై ‘ఈగ’ రూపంలో పగ తీర్చుకోవడం ఏమిటి? దాని కోసం దాదాపు 30 కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటి? అనే ప్రశ్నలకు సినిమా పూర్తిగా చూస్తే కాని జవాబు చెప్పలేము.

ప్రేక్షకుడిని కూర్చిలో కట్టి పాడేసే ఉత్కంటతో పాటు కొద్దిగా ఎంటరటైన్ మెంట్ జోడించి, ఈగ రూపంలో పగ తీర్చుకోవడాన్ని కన్వీన్సింగ్ గా రాజమౌళి చెపుతాడనే నమ్మకం వుంది. అందుకే ట్రైలర్ చూసాక, మొదటి రోజు ఆవేశంగా కాకుండా, నిదానంగా పిల్లలతో కలిసి మంచి థియేటర్ లో చూడటానికి ప్రిపేర్ అయిపోయాను.

గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. నిజంగా ఈగను చూస్తున్న ఫీలింగే వచ్చింది తప్ప అతిగా ఎక్కడా లేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.