రచ్చ సినిమాలో జగన్ పై డైలాగ్

కొత్త దర్శకుడు, అనుకున్న సమయానికి రిలీజ్ అవుద్దో లేదో అనే అనుమానం వలన సినిమాకు అసలు హైప్ క్రియేట్ అవ్వలేదు. కాని రిలీజ్ కు రెండు రోజులు ముందు రిలీజ్ అయిన సాంగ్స్ బిట్స్ లో చరణ్ స్టెప్స్ , ఒకేసారి సినిమాపై అభిమానులలో మంచి ఉత్సాహాన్ని నింపాయి.

రచ్చ early రిపోర్ట్స్ ను పరిశీలిస్తే : చిరంజీవి సినిమాలకు మొదటిరోజు వచ్చే టాకే, రచ్చ సినిమాకు కూడా వినిపిస్తుంది. నా లెక్క ప్రకారం, ఈ సినిమా వండర్స్ చెయ్యాలి. వండర్స్ అంటే మగధీర రేంజ్ కాదు కాని, మంచి సక్సస్ అనిపించుకోవడంతో పాటు వి.వి. వినాయక్ తో రాబోయే సినిమాకు మంచి పునాదిగా నిలబడుతుంది.

ఏమిటా టాక్?
1) అవుట్ & అవుట్ ఫుల్ మాస్ సినిమా – క్లాస్ కూడా చూడవచ్చు
2) సాంగ్స్ సూపర్

మెగా అభిమానులకు పండగ వాతావరణం సృష్టించడంలో రచ్చ సక్సస్ అయినా చిన్న నష్టం కూడా కలిగించినట్టు వుంది. అది ఏమిటంటే:

చిరంజీవి సినిమాలలో పరుచూరి బ్రదర్స్ ఏమి వ్రాస్తే అది యధాతదంగా చెప్పడం జరగదు. ఏ మాత్రం డబుల్ మీనింగ్ తో రెచ్చగొట్టే విధంగా వున్నా, చిరంజీవి మార్పులు చేర్పులు చేయించి తనదైన స్టైల్లో పండించే వాడు. కాని రచ్చ సినిమాలో పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ కు ఎడిటింగ్ జరిగినట్టు లేదు. దాని వలన వంశం డైలాగ్స్, వంశం రిఫరెన్స్ అని నందమూరి అభిమానులను ఆటపట్టించే అర్హతను మెగా అభిమానులు కోల్పోయారు.

BTW:

చరిత్ర వ్రాయటానికి వయసుతో పనిలేదు. ప్రజల అండదండలుంటే చాలు

ఈ డైలాగ్ ఎప్పుడూ జనంలోనే వుంటున్న జగన్ కు బాగా ఆప్ట్ అవుద్ది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.