కమర్షియల్ దర్శకుడి ఆలోచనలు ఎలా వుంటాయి?

వినాయక్‌ను ఫాలో అవ్వడం తప్ప కొత్తదనం ఏమీ వుండదు అని బోయపాటి అంటే చిన్నచూపు వుండేది. భద్ర, తులసి సినిమాలు నాకు నచ్చలేదు. కానీ సింహా చూసాక, బోయపాటి అంటే నమ్మకం వచ్చింది. ఈ రెండు స్టేట్‌మెంట్స్ విన్నాక దమ్ము కచ్చితంగా హిట్ అవ్వాలి అనిపించింది.

అందరూ బాగుండాలి. అందరూ మనవాళ్ళే అనే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా “దమ్ము” – బోయపాటి శ్రీను

సినిమా చూసే ప్రేక్షకులు ఆనందపడేలా,
అభిమానులు గర్వపడేలా,
నిర్మాత సంతోషంగా ఉండాలి

అనే ఆలోచనతో నేను సినిమాను ప్రారంభిస్తాను – బోయపాటి శ్రీను

ఓవర్ వయలెన్స్ – ఇదే బోయపాటి ఆయుధం. ఓవర్ వయలెన్స్ లేకపొతే బోయపాటి సినిమా వుండదు. ఇదే సినిమాకు ప్లస్. unfortunately ఓవర్ వయలెన్స్ అనే టాక్ సినిమా రేంజ్ తగ్గించవచ్చు. మరో మైనస్ హిరోయిన్లు. ఎన్.టి.ఆర్ పక్కన త్రిష, కార్తిక అంటే డైజస్ట్ చేసుకొవడం ఎందుకో కష్టంగా వుంది.

భారీ ఓపినింగ్స్ తో, హిట్ టాక్ సాధించాలన్న లక్ష్యంతో నిర్మింపబడుతున్న “దమ్ము” చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియాలంటే ఏప్రిల్ 27 వరకు ఆగాల్సిందే. సినిమా స్టిల్స్, ట్రైలర్ ఇప్పటికే అభిమానులలో మంచి ఉత్సాహాన్ని నింపి దమ్ము సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూసేలా చేసాయి.

ఈ సినిమా తర్వాత మెగాహిరోలతో సినిమా చేసే అవకాశం బోయపాటికి రావాలని ఆశీస్తున్నాను.

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.