పవన్‌కల్యాణ్ మాస్ స్టైలే వేరు

మాస్ … మాస్ .. మాస్ .. తెలుగుసినిమా అంటే మాస్. ఒక మాస్ సినిమా క్లాస్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందనే దాని మీదే ఆ సినిమా రేంజ్ ఆధారపడి వుంటుండి. ఒక క్లాస్ సినిమా తీసి చేతులు కాల్చుకునే కంటే ఒక మాస్ సినిమా తీస్తే మినిమమ్ కలక్షన్స్ సాధించవచ్చు.

నాకు సినిమా ఉహ తెలిసాక, మాస్ అంటే “చిరంజీవి”. చిరంజీవి అంటే మాస్. ఇంకొద్దిగా వయసు వచ్చాక మాస్ అంటే “బాలకృష్ణ” కూడా. యంగ్ ఎన్.టి.ఆర్ మాస్ ఇమేజ్ సాధించాడు అంటే అది నాకు బాలకృష్ణను ఫాలో అవ్వబట్టే అని అనిపిస్తాది.. ఈరోజున రామ్ చరణ్ “రచ్చ” విజయం సాధించంటే 100% చిరంజీవి మాస్ ఫార్ములానే.

మన హీరోలకు మాస్ ఫార్ముల ఎలా వుందో, కొందరి దర్శకులకు కూడా వారి వారి మాస్ మార్క్ వుంటుంది. వాళ్ళ ఫార్ములకు హిరో ఇమేజ్ తోడయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు కూడా వున్నాయి.

నాగార్జున “శివ” సినిమా ద్వారా వచ్చిన ఇమేజ్‌ను ఆ తర్వాత వచ్చిన ఏ ఎక్సపరమెంట్ మూవీ నిలబెట్టలేకపొయాయి. “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం” అనే మాస్ సినిమా ద్వారా తెలుగుప్రేక్షకులకు ఆకట్టుకోగల్గాడు. “ప్రెసిడెంట్ గారి పెళ్ళాం” కూడా రోటిన్ మాస్ సినిమానే.

రామ్‌చరణ్ కూడా రొటీన్ మాస్ మూవీ “రచ్చ” ద్వారా మగధీర సినిమా ఇమేజ్ నుంచి చాలా తొందరగా బయటకు రాగల్గాడు.

పవన్‌కల్యాణ్ మాస్ స్టైలే వేరు:
పవన్ కల్యాణ్ మాత్రం “ఖుషీ” ఇమేజ్ నుంచి బయటకు రాలేకపొతున్నాడు. జల్సా లాంటి కమర్షియల్ హిట్ వచ్చినా పవన్‌కల్యాణ్ రేంజ్‌కు అది తక్కువే అనే ఫీలింగ్ చాలామంది అభిమానులలో వుంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ డిఫరెంట్. “గుడుంబా శంకర్” తీసుకుంటే, వేరే ఏ స్టార్ హిరో అయినా ప్రయత్నించడానికి కూడా భయడతారు. ఖుషి సినిమాలో ఫైట్స్ ఇప్పటికీ అనుకరిస్తున్నారంటేనే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ మాస్ మార్క్ ఇంపాక్ట్ ఎంతో.

రొటీన్ గా మాస్ చెయ్యడానికి పవన్ కళ్యాన్ ఇష్టపడడు:
తమ్ముడు కావడం వలన చిరంజీవిలా అనిపిస్తాడేమో కాని, చిరంజీవి స్టైల్లోనే మాస్ చెయ్యాలని ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలేదు. దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందేమో. చిరంజీవి లా ఒక్క పాటలో డాన్స్ చేస్తే చాలు, “రచ్చ” లాంటి బిగ్ హిట్ అభిమానులు ఎప్పుడో ఇచ్చేవారు. పవన్ కళ్యాణ్ తో చేసే దర్శకులు ఎవరూ అలా ఎందుకు ఎప్రోచ్ అవ్వలేదో అనిపిస్తుంది. బహుశా దానికి కారణం రొటీన్ గా మాస్ చెయ్యడానికి పవన్ కళ్యాన్ ఇష్టపడక పోవడం వలనేనెమో.

‘గబ్బర్ సింగ్’ హిట్టా ఫట్టా?
రచ్చ సినిమా మెగా అభిమానుల శిబిరాలలో ఆనందోత్సాహలని నింపింది. ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆ ఆనందోత్సాహలని కంటీన్యూ చేస్తుందని ఎన్నో ఆశలతో వున్నారు. హరీష్ శంకర్ ట్విట్స్ చదివితే కచ్చితంగా ఇది రొటీన్ మాస్ ఫిల్మ్ కాదు. పవన్ కళ్యాణ్ స్టైల్లో సాగే మాస్ ఫిల్మ్ అని అర్దం అవుతాది.

పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్లో “గుడుంబా శంకర్” మాదిరి కేవలం అభిమానులకు మాత్రమే నచ్చితే సరిపోదు, ఖుషి మాదిరి అన్ని వర్గ ప్రేక్షకులను ఊర్రుతలూగించాలి.

పవన్ కళ్యాణ్ చిరంజీవిలా స్టెప్స్ వెయ్యడు. ఆడియో ఎంత పెద్ద హిట్ అయినా, ఇనస్టెంట్ గా మొదటి రోజు మాస్ ప్రేక్షకులకు నచ్చవు, స్క్రీన్ మీద స్లోగా కిక్ ఇస్తాయి.

గబ్బర్ సింగ్ సినిమా రచ్చ సినిమాను మించిన హిట్ అవ్వాలంటే:
1) దబాంగ్ స్టోరిలో భారీ మార్పులు చేసివుండాలి. (హరీష్ శంకర్ చేసానని అంటున్నాడు )
2) పవన్ కళ్యాన్ మాస్ స్టైల్ ఒక ట్రెండ్ ను క్రియేట్ చేసే విధంగా వుండాలి. (వెయిట్ చెయ్యాలి )

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.