ప్రస్తుతం బోయపాటి & హరీష్ శంకర్ లకు ఒక కామన్ పాయింట్ వుంది. దమ్ము, గబ్బర్ సింగ్ సినిమాల ద్వారా స్టార్ డైరక్టర్ ఇమేజ్ తెచ్చుకోవడానికి ఇద్దరూ శాయశక్తులా కష్టపడుతున్నారు/కృషి చేస్తున్నారు.
బోయపాటి దర్శకత్వం వహించిన సినిమాలు: దిల్ రాజు ‘భధ్ర’ , వెంకటేష్ ‘తులసి’ & బాలకృష్ణ’సింహా’
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు: రాంగోపాలవర్మ ‘షాక్’ , రవితేజ ‘మిరపకాయ్’
బోయపాటికి ఫ్లాప్ లేకపోయినా, హరీష్ శంకర్ ‘మిరపకాయ్’లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చినా, ఇద్దరికీ స్టార్ డైరక్టర్ ఇమేజ్ రాలేదు. (It is like, for some reason జల్సా లాంటి కమర్షియల్ హిట్ ను హిట్ గా జనాలు చెప్పుకోరు. బహుశా ఇంకా ఎక్కువ ఎక్సపేట్ చెయ్యడం వలనేమో)
షాక్ దర్శకుడితో పవన్ కళ్యాణ్ సినిమా అనగానే “ఎవరా దర్శకుడు?” అని అందరూ ఒక్కసారిగా హరీష్ శంకర్ ను వెతకడం మొదలు పెట్టారు. “మిరపకాయ్” పవన్ కళ్యాణ్ కోసం చేసిన సబ్జక్టే. సబ్జక్ట్ అంతా రెడీ అయ్యాక పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేయకపోవడంతో రవితేజతో చేసాడు. అలా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, ‘గబ్బర్ సింగ్’ ను దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చాడు.
బోయపాటి, ‘సింహా’ లాంటి కమర్షియల్ హిట్ ఇచ్చి కూడా ఎంతో ఓపికతో ఎన్.టి.ఆర్ కోసం కథలు మీద కథలు తయారు చేసి, చివరకు “అందరూ బాగుండాలి, ఆ అందరిలో నేను ఒకడినై వుండాలి” అనే కాన్సప్ట్ తో “దమ్ము” ఒకే చేయించుకున్నాడు.
తెలుగు ప్రేక్షకులకు హీరోలే స్టార్స్ కాబట్టి, ఆ స్టార్స్ ఎన్.టి.ఆర్ పవన్ కళ్యాణ్ లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కమర్షియల్ విజయాలు అందించి , ఈ ఇద్దరూ స్టార్ డైరక్టర్స్ గా మారతారని ఆశీద్దాం.
BTW, మన తెలుగుసినిమాకు రాజమౌళి, వి.వి.వినాయక్ లాంటి స్టార్ దర్శకులను ఎన్.టి.ఆర్ అందిస్తే, కరుణాకరన్, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులను పరిచయం చేసిన ఘనత పవన్ కళ్యాణ్ ది.