“రచ్చ” సూపర్ హిట్ కు కారణం ఏమిటి?

ఎంత మంది బాగుందన్నా, నాకు నచ్చకపొతే నేను ఆ సినిమాను ఫ్లాప్ గానే చూస్తాను. ఎంత మంది బాగోలేదన్నా, నాకు నచ్చితే నేను ఆ సినిమాను హిట్ గానే చూస్తాను. రచ్చ సినిమా సూపర్ హిట్ అని ఒప్పుకోవడానికి చాలా మందికి మనసు ఒప్పుకోదు. దానికి కారణం సినిమా అంతా ఎంజాయ్ చేసినా, సినిమాలో ఏమి లేదనే ఫీలింగ్ వుంటుంది. ఎవరి అభిప్రాయం వారిది, అబద్దం కాని ఆ అభిప్రాయాన్ని గౌరవించాలి కాబట్టి thats ok .

Prashanth Bhat ‏ @prashanthbhat
A person argued with me saying ‘Racha’ is not a hit. Rs 23 crore openings is phenomenal.I can’t enlighten people living in their own world!
Retweeted by Sreenivas kumar

రచ్చ సినిమాను “చాలా బావుంది.. మిస్ అవ్వకుండా చూడండి” అని అందరికీ చెప్పలేం, మనతో కనెక్ట్ అయ్యే కొందరికి మాత్రమే చెప్పగలం. నాకు సూపర్ డూపర్ అనిపించకపోయినా సినిమా బాగానే వున్నట్టు అనిపించింది. దానికి కారణాలు:

1) ఈ సినిమా పబ్లిసిటీలో రామ్ చరణ్ కాని, దర్శక నిర్మాతలు కాని “రచ్చ” సినిమా కథ సూపర్ డూపర్ అని చెప్పలేదు. మాస్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా తీసిన సినిమా అని మొదట నుంచి చెప్పుకోచ్చారు. అలానే వుంది.

2) కామెడీ బాగా పండింది. పాత కథ, పాత కథనం, 90’sలో సినిమా అనిపించినా ఎక్కడా బోర్ కొట్టలేదు.

3) సాంగ్స్ లో రామ్ చరణ్ స్టెప్స్. చిరంజీవి అభిమానిగా, చిరంజీవి డాన్స్ తో కనెక్ట్ అయినట్టుగా రామ్ చరణ్ తో కనెక్ట్ అవ్వకపోయినా satisfied enough.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.