‘గబ్బర్ సింగ్’ అంచనాలను రీచ్ అవుతాడా?

పబ్లిసిటీ – ఎటువంటి సినిమా చూడబోతున్నామో, ఎటువంటి ఎక్సపేటెషన్స్ తో సినిమాకు రావాలో చెప్పడం
హైప్ – ఎక్సపేటెషన్స్ పెంచడం

భారీ ఓపినింగ్స్ సాధించడంతో పాటు మంచి పాజిటివ్ టాక్ కూడా సంపాదించు కోవాలంటే ఏ సినిమాకైనా పబ్లిసిటీ & హైప్ రెండూ చాలా అవసరం. హైప్ లేకపోతె ఓపినింగ్ కలక్షన్స్ డల్ గా వుంటాయి. అలా అని హైప్ కోసమే పబ్లిసిటీ చేస్తే ఘోరమైన ఫ్లాప్ టాక్ వస్తుంది.

గబ్బర్ సింగ్ సినిమా రీమేక్ కాబట్టి, ఈ సినిమాకు పబ్లిసిటీ అవసరం లేదు. సినిమా అంతా అందరికీ తెలిసిందే. ఆడియో రిలీజ్ కు ముందే సినిమాపై హైప్ క్రియేట్ చెయ్యడంలో దర్శక నిర్మాతలు 100% సక్సస్ అయ్యారు. ఆడియో ఆ హైప్ ను మరింత పెంచింది.

పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏమిటంటే, తాను చెయ్యాలనుకునే క్యారెక్టర్స్ దర్శకులకు చెప్పి ఆ విధంగా కథలు తయారు చేయించుకుంటాడు.

దబాంగ్ కథ తెలుగు ప్రేక్షకులకు 100% నచ్చదు అని ఎవరైనా చెప్పగలరు. కథలో భారీ మార్పులు అవసరం. పవన్ కళ్యాణ్ ఈ సినిమా చెయ్యడానికి కారణం కథ నచ్చి మాత్రం కాదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చెయ్యాలను కోవడానికి కారణాలు:

1) పోలిస్ ఆఫీసర్ – ఒక పవర్ ఫుల్ పొలీస్ ఆఫీసర్ రోల్ చెయ్యాలని గుడుంబా శంకర్ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ కలలు కంటున్నాడు. ఆ కలలో భాగంగా చేసిన ఎస్.జె.సూర్య ‘కొమరం పులి’ అంత సంతృప్తి ఇవ్వలేదు. సో గబ్బర్ సింగ్ ఒక పవర్ ఫుల్ & ఫియర్ లెస్ పోలిస్ ఆఫీసర్ మీద జరిగే కథ.

2) ఎవరికీ సులువుగా అర్ధం కాని తిక్క క్యారెక్టరైజేషన్

ఈ రెండు పాయింట్స్ మిస్ అవ్వకుండా కథ మార్చమని పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కు చెప్పడం జరిగింది. కథను తెలుగు ప్రేక్షకులను నచ్చే విధంగా మరియు అర్ధం అయ్యే విధంగా హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తీర్చిదిద్ది వుంటే, గబ్బర్ సింగ్ మన అంచనాలను రీచ్ అవ్వడమే కాదు, తెలుగుసినిమా బాక్సాఫీస్ బాక్స్లు బద్దలవ్వడం కూడా ఖాయం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.