మెగాబ్రదర్స్ ను ఒక స్టేజి పైకి తీసుకొచ్చిన ఘనత మీడియాదే

రచ్చ పాటల వేడుకకు పవన్ రాలేదు. రెండు రోజుల తర్వాత పూరి సినిమా పూజా కార్యక్రమంలో పవన్ కనిపిస్తే, కావాలనే రచ్చ పాటల వేడుకకు పవన్ రాలేదని ప్రచారం చేశారు. అబద్దం చెప్పే స్థాయికి మా కుటుంబం దిగజారలేదు. – చిరంజీవి

రచ్చ ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి & చరణ్ అబద్దం చెప్పినట్టుగా అందరూ అనుకుంటున్నారు కాబట్టి, చిరంజీవి అలా అనడంలో అసలు తప్పు లేదు.

My point of view:
ఎవరిది తప్పు అయినా, పవన్ కళ్యాణ్ ను ఏమైనా అనే అధికారం చిరంజీవికి వుంది. చిరంజీవి ఏదైనా అంటే చిరంజీవిపై అలిగే అర్హత పవన్ కళ్యాణ్ కు వుంది.

1) రెండు మూడు సంవత్సరాల కాలంలో మెగాబ్రదర్స్ ను ఒక స్టేజిపై చూడలేదు. మెగా అభిమానులకు చూడాలని వుంది.
2) వీలు లేకో, చిన్న చిన్న మనస్పర్ధలు వలనో ఒకే వేదికపై మెగా బ్రదర్స్ కనిపించలేదు.
3) జనాలు, న్యూస్లో ఏవో మెలికలు వుంటే కాని టి.విలు చూడటం లేదు, పేపర్లు చదవటం లేదు.
4) పవన్ అమెరికా వెళ్ళాడు అన్నారు, తర్వాతే రోజే గబ్బర్ సింగ్ క్లైమాక్స్ షూటింగ్ అని హరీష్ శంకర్ ట్వీట్ చేసాడు. ఆ తర్వాతే రోజే పూరి సినిమా పూజా కార్యక్రమంలో పవన్ ప్రెష్ గా కనిపించాడు.

ఈ ఇన్సిడెంట్స్ అన్నీ పవన్ కళ్యాణ్ అమెరికా వెళ్ళడం అసాధ్యం అన్నట్టుగానే అనిపిస్తున్నాయి. మీడియా మాటలు నమ్మవలసి వచ్చింది.

మీడియా అలా ప్రచారం చేయడం వలన మెగాబ్రదర్స్ తమ మధ్య వున్న చిన్న చిన్న మనస్పర్దలకు ఫుల్ స్టాప్ పెట్టి ‘గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్ లో కనిపించారు. మెగా అభిమానుల కోరికను నెరవేర్చారు.

ప్రజా సమస్యలపై దృష్టి సారించ వలసిన మీడియా, ఇటువంటి చిన్న చిన్న వ్యక్తిగత విషయాలపై అతిగా స్పందించడం బాద్యతా రాహిత్యం అయినా, ఆ విధంగా మెగాబ్రదర్స్ ను ఒక స్టేజి పైకి తీసుకొచ్చిన ఘనత మీడియాదే. great work by Media.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.