‘గబ్బర్ సింగ్’ హైప్ కే పరిమితం అవుతుందేమోనని భయపడుతున్న మెగాఅభిమానులు

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఆడియో సూపర్ హిట్ గ్యారంటీ. అది కొత్తేమి కాదు. గబ్బర్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే క్లాస్, ఫ్యాన్స్ కు నచ్చే సాంగ్స్ తో పాటు పక్కా మాస్ కు సూపర్ కిక్ ఇచ్చే ‘కెవ్వు కేక’ సాంగ్ వుండటం.

ఆడియో బిగ్ రేంజ్ లో హిట్ అయ్యింది. ఆడియో రేంజ్ లో ‘గబ్బర్ సింగ్’ సినిమా కూడా వుంటుందా? అన్నదే మెగా అభిమానులలో వున్న మొదటి ప్రశ్న.

ఆ ప్రశ్నతో పాటు మరో రెండు ప్రశ్నలు కూడా వున్నాయి.

1) మొదటి రోజు ప్రేక్షకులను ‘రచ్చ’ సినిమా ఆకట్టుకున్నట్టుగా ‘గబ్బర్ సింగ్’ సినిమా ఆకట్టుకొని సూపర్ హిట్ టాక్ సంపాదిస్తుందా?

2) రామ్ చరణ్ చిరంజీవి స్టైల్ ను అనుకరించి, డాన్స్ అభిమానులు మెచ్చే విధంగా చేసి అలరించాడు. పవన్ కళ్యాణ్ ఏ విధంగా చేసి అభిమానులను, మొదటిరోజు ప్రేక్షకులను అలరిస్తాడు?

గబ్బర్ సింగ్ యూనిట్ హడావుడి చూస్తుంటే పాటలన్నీ చుట్టి పారేస్తున్నట్టుగా వుంది తప్ప, అభిమానులనే అలరించే కాన్సప్ట్ స్టెప్స్ స్పెషల్ గా డిజైన్ చేసి చేస్తున్నట్టుగా అనిపించడం లేదు.

అభిమానులు తమ అనుమానాలు తప్పు అయ్యి , ఆడియో కంటే విడియో పెద్ద హిట్ అవ్వాలని: దర్శక నిర్మాతలు సినిమా హైప్ చేయడంలో చూపించిన శ్రద్ధ, పాటలు స్క్రీన్ మీద ఫ్యాన్స్ కు కావలసిన విధంగా పిక్చరైజేషన్ పై కూడా శ్రద్ధ వహించి అందరినీ ఆకట్టుకొని సూపర్ హిట్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.