‘దమ్ము’తో యంగ్ ఎన్.టి.ఆర్ కలక్షన్స్ దుమ్ము లేపనున్నాడా?

“మనిషికి నేను మాత్రమే గొప్ప అనే అహంభావం వుండకూడదు. నేను గొప్ప కావచ్చు, నాలాంటి గొప్పవాళ్ళు చాలామంది వున్నారు, నేను ఎటువంటి గౌరవాన్నిఅయితే కోరుకుంటున్నావో, అటువంటి గౌరవాన్ని అందరికీ అందించు.”

పైన చెప్పిన క్వాలిటీ మనిషి కలిగివుండటం ఒక ఎత్తు అయితే, పెద్ద ఇమేజ్ కలిగి అది పబ్లిక్ గా చేసి చూపించడం నిజమైన “దమ్ము”.

ఏదో వంకతో అభిమానులు కొట్టుకు చస్తున్న ఈరోజుల్లో, ఎవరికీ భయపడకుండా ప్రధాన ప్రత్ర్యర్ది హిరో “రామ్ చరణ్” ని గౌరవిస్తూ తన తర్వాత సినిమా క్లాప్ కొట్టడానికి ముఖ్య అతిధిగా ఆహ్వానించి మెగా అభిమానులను ఆకట్టుకున్నాడు యంగ్ ఎన్.టి.ఆర్.

రామ్ చరణ్ “రచ్చ” మాదిరి “దమ్ము” ఆడియో ఇప్పటికే అభిమానులను, మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దర్శకుడు బోయపాటి హిరో ఎలివేషన్ మరియు సినిమా ఎక్కడా డ్రాప్ కాకుండా మెయింటేన్ చెయ్యడం, ఒక రేంజ్ లో వుంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

కమర్షియల్ మాస్ సినిమా ఎప్పుడూ మోసం చెయ్యదు అని మా విశ్వాసం – పరుచూరి గోపాలకృష్ణ

‘దమ్ము’ సినిమా హిట్ అయితే గ్యారంటీ. ఏ రేంజ్ హిట్ అనేది ఎంత ప్రగడ్బంధిగా నిర్మించారని అనే దానిపై ఆధారపడి వుంది.

ప్రత్యర్ది హిరో మన హిరో రికార్డులు కొట్టాలి, ఆ రికార్డులను మన హిరో కొట్టాలి. (ట్వీటర్ లో కాదు సుమీ) . రామ్ చరణ్ “రచ్చ” మించి ఎన్.టి.ఆర్ “దమ్ము” హిట్ అవ్వాలి. ఎన్.టి.ఆర్ “దమ్ము” ను మించి పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” హిట్ అవ్వాలని కోరుకుందాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.