ప్రత్ర్యర్దులని గెలిపిస్తూ మీరు గెలవడం ఎలా? – you must try

“We teach our children all about life, BUT our children teach us what life is all about.”
– Unknown

‘గెలుపు’కు ఎన్నో నిర్వచనాలు వున్నాయి.
నేను గెలవక పోయినా పర్వాలేదు, వాడు మాత్రం అసలు గెలవకూడదు. ఇది కొందరి నిర్వచనం.
యుద్దంలో గెలవడం అంటే ప్రత్యర్ధిని ఓడిచండం మాత్రమే, ప్రత్యర్ధిని చంపడం కాదు. ఇది జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన నిర్వచనం.

ఇప్పుడు కొత్తగా, “ప్రత్ర్యర్దులని గెలిపిస్తూ నేను గెలవడం ఎలా?” అనేది మా పిల్లలు నేర్పారు నాకు.పిల్లలతో ఆడుతున్నప్పుడు అయినా నాకు ఓడిపోవడం అసలు ఇష్టం వుండను. గెలుపు రుచి, గెలుపులో వున్న ఆనందం వారికి చూపించడానికి అయిష్టం గానే ఓడిపోవాల్సి వస్తుంది.

at the same time,

“ఓటమిని అపజయంగా తీసుకోకూడదు. ప్రత్యర్ది గొప్పతనంగా గుర్తించాలి.” అని పిల్లలకు ఎలా చెప్పాలని తెగ ఆలోచించేవాడిని. మొన్న సడన్ గా ఈ ఆలోచన వచ్చింది. ఇప్పుడు పిల్లలతో కూర్చుంటే ఇదే గేం ఆడుతున్నా.

ఏమిటా గేం? ఎలా ఆడాలి?
tic tac toe. నేను కనిపెట్టిన గేం కాదు. చిన్న ట్రిక్ మాత్రమే.

ఆ ట్రిక్ ఏమిటంటే, ఎవరు ముందుగా ప్రత్యర్దిని 10 సార్లు గెలిపిస్తారో వారు గెలిచినట్టు. ప్రత్యర్దిని గెలిపించడం అంత ఈజీ కాదు. so మీరు గెలవడం అంత ఈజీ కాదు. you must try.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సెల్ఫ్ డబ్భా, Xclusive. Bookmark the permalink.