తెలుగు నేటివిటికి ఆమడ దూరంలో ‘గబ్బర్ సింగ్’

ఒకప్పుడు ‘టైగర్ సీతారాముడు’ అని ఒక సినిమా చెయ్యాలనుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమా కోసం తీసిన వర్కింగ్ స్టిల్స్ ఒక డిజైనర్ దగ్గర నాలుగైదు యేళ్ళ క్రితం చూసాను. ఆ సినిమా కాన్సప్ట్(బ్యాక్ డ్రాప్) అంతా ‘గబ్బర్ సింగ్’ స్టిల్స్ లో కనిపిస్తుంది. ఆ సినిమాకు ఈ సినిమాకు ఒక్కటే తేడా .. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ నక్సలైట్ .. ఈ సినిమాలో పొలీస్ ఆఫీసర్. ఇంకో చిన్న తేడా ఆ సినిమాలో పాత్రకు తగ్గట్టు అన్-గ్లామర్ గెటప్. ఈ సినిమా ప్రేక్షకులకు కావలసిన విధంగా గ్లామర్ గా వున్నాడు.

కథ మన మధ్య జరుగుతున్నట్టుగా వుంటే అదే తెలుగు నేటివిటి.

లేదంటే కథ ఎక్కడ జరుగుతుందో, అక్కడ ఎందుకు జరుగుతుందో ప్రేక్షకులకు స్పష్టంగా చెప్పాలి. ఇది చాలా కీలకం.

‘గబ్బర్ సింగ్’ మాస్ జెనర్ కాబట్టి:

1) సినిమా ఎలా వున్నా, ఇప్పుడు వున్న హైప్ కు ‘రచ్చ’ రేంజ్
2) మొదట పది పదిహేను నిమషాలు ప్రేక్షకులను కంఫర్టబుల్ గా కథలోకి తీసుకొని వెళితే, ‘దూకుడు’ రేంజ్
3) అదృష్టం కలిసొస్తే ‘మగధీర’ రేంజ్

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.