‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు ప్రేక్షకుల టాక్

కేవలం ఫ్యాన్స్ కు మాత్రమే సినిమా నచ్చితే సినిమాలు ఆడేయవు. మొదటి రోజు చూసే ప్రేక్షకులలో ఫ్యాన్స్ తో పాటు సినిమా పిచ్చోళ్ళు చాలా మంది వుంటారు. ఏ సినిమాకు అయినా మొదటి రోజు టాక్ చాలా ఇంపార్టెంట్. ‘గబ్బర్ సింగ్’ మొదటి రోజు ప్రేక్షకుల టాక్ ఎలా వుండబోతుంది? అనేది గెస్ చేయడం కష్టం.

ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్ మొదటిరోజు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డాన్స్ వెయ్యడు. రచ్చ కు వచ్చిన లాంటి టాక్ రావడం చాలా కష్టం.( like సినిమా ఎవరేజ్ , సాంగ్స్ సూపర్ లాంటి టాక్) . ‘గబ్బర్ సింగ్’ పాటలు సూపర్ కదా అని స్టెప్స్ ఎక్కువ ఉహించుకుంటే కచ్చితంగా నిరాశే.

పవన్ కళ్యాణ్ సినిమాలో సాంగ్స్ కూల్ గా చూస్తే మాత్రం సూపర్ గా వుంటాయి. ఆ కూల్ నెస్ కు , మొదటిరోజు ప్రేక్షకులకు నచ్చే విధంగా రెండు మూడు స్టెప్స్ పడితే మొదటిరోజు టాక్ అదిరిపోతుంది.

హరీష్ శంకర్ డైలాగ్స్ హైలట్ అనే టాక్ నడుస్తుంది.ఫ్యాన్స్ కు, మాస్ ప్రేక్షకులకు ఇరగ నచ్చే అవకాశం వుంది. ఈ కోణంలో మొదటిరోజు టాక్ అదిరిపోతుంది.

ఈ సినిమాకు అసలు సిసలైన కీలకం కథ. దబాంగ్ అసలు కథలో హరీష్ శంకర్ చేసిన మార్పులు, పవన కల్యాణ్ కోరుకునే కొత్త నేటివిటి .. తెలుగు ప్రేక్షకులకు నచ్చితే మొదటిరోజు టాక్ అదిరిపోతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.