మే 11న ‘గబ్బర్ సింగ్’

పవన్ కళ్యాణ్ కు ఖుషి సినిమా ద్వారా వచ్చిన స్టార్డం తర్వాత ఏకగ్రీవంగా హిట్ టాక్ వచ్చిన సినిమా లేదు. జల్సా కమర్షియల్ బ్లాక్ బస్టర్ అయినా నాలాంటి వాళ్ళు పవన్ రేంజ్ హిట్ కాదనే వాదిస్తారు.

ఖుషి సినిమా తర్వాతా ఎంతో కష్టపడి చేసిన రెండు సినిమాలు ‘జాని’, ‘గుడుంబా శంకర్’ ఫెయిల్ అవ్వడం, ప్రేక్షకులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో తెలియక పూర్తిగా దర్శకులకే వదిలేయడం మొదలు పెట్టాడు. ఆ టెక్నిక్ కూడా పని చేయకపోవడంతో, ‘తీన్ మార్’ నుంచి ఎక్స్ట్రా ఇంటరెస్ట్ తో చేయడం మొదలు పెట్టాడు.

for me, its పవన్ కళ్యాణ్ రెండో ఇన్నింగ్స్:
‘తీన్ మార్’ = సచిన్ సెంచరీ కొట్టి ఇండియా ఓడిపోవడం లాంటిది. పవన్ కళ్యాణ్ ఫాంలోకి రావడం అభిమానులలో మంచి ఉత్సాహాన్ని నింపింది.

పంజా = మరో ‘జానీ’. 5% తప్ప, ఎవరికీ నచ్చలేదు సరికదా, సినిమాలంటే విరక్తి కలిగించిన సినిమా. కాని కొత్తదనంతో ఏదో చెయ్యాలన్న ఆలోచన పవన్ కళ్యాణ్ లో అలానే వుంది. రైట్ దర్శకుడు పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాలంతే(పవన్ ఎవరి దగ్గరకూ వెళ్ళడు(just kidding)).

‘గబ్బర్ సింగ్’ = పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇన్ పుట్స్ తో కథలో దర్శకుడు చేసిన మార్పులు ఏమిటా అని ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా. రైట్ దర్శకుడితో చేస్తున్న సినిమా అని అనిపిస్తుంది. ఇంకో 5 రోజులు వెయిటింగ్ అంటే కష్టంగా వుంది.

మెగా పబ్లిసిష్ట్ SKN ప్రకారం మే11 న అని ఆఫీషియల్‌గా ఎనౌన్స్ చెయ్యడానికి సినిమా సెన్సార్ కావాల్సి వుంది. ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం మే 5 న కాకుండా, మే 7 సోమవారం నాడు సెన్సార్ కానుంది.

Kareem Shaik ‏ @Kareem1911
@sknonline GS release date bhayya? 11th ne na? No official announcement til now

Sreenivas kumar ‏ @sknonline
@Kareem1911 censor avvakunda official ga ela chestaru baas wait till monday

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.