రాజమౌళి ‘ఈగ’ లేటుగా రిలీజ్ అవ్వడానికి కారణం

EEGA 2nd trailer is getting ready. This will be in theatres in 4 or 5 days. — raja mouli

2012 సంవత్సరంలో ఎప్పుడు ఎప్పుడు అని అన్ని సినిమాలలో ఎక్కువగా ఎదురుచూస్తున్న సినిమా రాజమౌళి ‘ఈగ’. ముందుగా ఏప్రిల్ 5న రిలీజ్ అని ఎనౌన్స్ చేసి, ఇప్పుడు మే 30న అంటున్నారు. రచ్చ, దమ్ము, గబ్బర్ సింగ్ లాంటి భారీ సినిమాల మధ్య విడుదలై, వాటికి దీటుగా సంచనాలు సృష్టిస్తుందనుకుంటే వాటికి దూరంగా మే 30న అంటూ డిస్సపాయింట్ చేసారు.

ఒక సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఎన్ని రోజులు పని చేసారు? అనే విషయం ప్రేక్షకుడికి అనవసరం. కాని సినిమాపై అంచనాలు పెంచడానికి(హైప్ క్రియేట్ చెయ్యడానికి), సినిమా మేకర్స్ అసలు నంబర్స్ ను డబుల్ చేసి గాసిప్స్ గా రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే వో .. ఈ సినిమా ఇంత కష్టపడ్డారా? ఇంత ఖర్చు పెట్టారా? అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో పెరిగి మంచి ఓపినింగ్స్ వచ్చే అవకాశం వుంది.

ఈగ కోసం ఎంత ఖర్చు పెట్టి వుంటారు? ఎన్ని రోజులు పని చేసి వుంటారు?
ఒకటిన్నర సంవత్సరం పైనే పని చేసారు. కచ్చితంగా 30 కోట్లు పైనే ఖర్చు పెట్టి వుంటారు.

ఈగపై అంత పెట్టుబడి, అంత కాలం స్పెండ్ చెయ్యటం అవసరమా?
ఒక పక్క రాంగోపాలవర్మ కేవలం 5 రోజులలో జీరో ఖర్చుతో సినిమా చుట్టి పడేసి జనాలు మీదకు వదిలేస్తుంటే, ఇన్ని రోజులు ఇంత ఖర్చు వేస్ట్ అనిపించవచ్చు.

కాని ఇప్పటి రాజమౌళిని చూస్తుంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు వస్తున్నాడు. తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జాని, గుడుంబా శంకర్ .. ఈ సినిమాలన్నీ క్వాలిటీ క్వాలిటీ క్వాలిటీ అంటూ సంవత్సరం పైనే కష్టపడి నిర్మించినవే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు తెలుగు ప్రేక్షకుల స్థాయిని పెంచే సినిమాలు తీయ్యాలంటే, తనకు వచ్చిన ఇమేజ్ తో కేవలం నాలుగు డబ్బులు వెనకేసుకుందాం అనే ఆలోచన మాత్రమే కాదు, ‘ఈగ’ లాంటి ఎక్సపెరమెంట్స్ మాస్ ప్రేక్షకులకు అర్ధం అయ్యి మెచ్చే విధంగా తీసే రాజమౌళి లాంటి దర్శకులు వుండాలి. రాజమౌళి ‘ఈగ’ ఎంత లేటుగా రిలీజ్ అయినా పర్వాలేదు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.