‘గబ్బర్ సింగ్’ my exclusive review

‘గబ్బర్ సింగ్’ సినిమా ప్రత్యేకత ఏమిటి?
ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఫాస్ట్ గా షూటింగ్ చెయ్యడమే కాదు, షూటింగ్ తో పెరలెల్ గా భలే హైప్ చేసారు. ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గని సినిమా.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒకటి/రెండు సంవత్సరాలు షూటింగ్ జరగాలి అనే మైండ్ సెట్ తో వున్న నాలాంటి వాళ్లకు, సినిమా చుట్టేసారనే అనుమానం వుంది. ఈ సినిమాలో హీరో తిక్కకు లెక్క వున్నట్టు, ఈ సినిమా నాలుగు నెలల్లో చుట్టేసినా, పూర్తి అవగాహనతో తీసారు.

‘గబ్బర్ సింగ్’ సినిమా ఎలా వుంది?
తెలుగుసినిమా ప్రపంచంలో పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, స్థానం వేరు అని తెలియజెప్పే సినిమా ‘గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ ‘దబాంగ్’ లో ఏమైతే మార్పులు కోరుకున్నాడో, పరఫెక్ట్ గా ఆ మార్పులు చేసి, మెగా అభిమానుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని హరీష్ శంకర్ సాధించాడు.

పంజా ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ “సినిమా అనేది టీమ్ వర్క్, నేను తెర మీద కనిపించిన మాత్రాన, ఆ క్రెడిట్ అంతా తీసుకోలేను” అని అన్నాడు. అది నిజమే కాని “నా వెనుక పవన్ కళ్యాణ్ వున్నాడు, పవన్ కళ్యాణ్ కోరిన విధంగా మార్పులు చేస్తే చాలు” అనే డ్రైవింగ్ ఫోర్సుతో ఒరిజినల్ దబాంగ్ కు పవన్ కళ్యాణ్ స్టైల్ కు అనుగుణంగా సీన్స్ వ్రాసుకున్న హరీష్ శంకర్ అనితర సాధ్యుడు. గ్రాండ్ గా వుండాలి ఖర్చుకు వెనుకాడని బండ్ల గణేష్ సపోర్ట్ తో, దేవిశ్రీ ప్రసాద్ దగ్గర నుండి మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ సంపాదించి మెగా అభిమానులకు సూపర్ గిఫ్ట్ అందించాడు హరీష్ శంకర్.

సినిమాలో డ్రాబాక్స్ ఏమిటి?
1) హిరోయిన్ ఫ్రెండ్ గా నటంచిన హ్యాపీ డేస్ ఫేం గాయత్రి మేకప్ బాగోలేదు. మాస్ కు నచ్చుతుంది. క్లాస్ కు కష్టం. 2) హిరో తల్లిని విలన్ ఎందుకు చంపాడు అనేది చెప్పక పోవడం వలన, పగ ఎమోషన్ తగ్గింది.

ఫుల్ పాజిటివ్ టాక్ లో డ్రాబాక్స్ కొట్టుకుపోయే ఛాన్స్ పుష్కలంగా వుంది. కాబట్టి అంత వర్రీ కానక్కర్లేదు.

పవన్ కళ్యాణ్ ఎలా చేసాడు?
సినిమా అంతా పవన్ కళ్యాణ్ చేసే తిక్క చేష్టలకు డైరక్టర్ మంచి జస్టిఫికేషన్ ఇవ్వడం వలన, పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, స్థానం వేరు అని అనిపించింది.

పవన్ కళ్యాణ్ తాను నవ్వడమే కాదు, మనల్ని నవ్వించాడు. ఆ నవ్వులతో పాటు, తండ్రితో కలిపి ఏడిపించాడు కూడా.

కథలో ఏమి మార్పులు చేసారు? కొత్త కథ ఏమిటి?
నాకు దబాంగ్ లో కథ కనిపించలేదు. గబ్బర్ సింగ్ లో కూడా కథ కనిపించలేదు. స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ స్టైల్ కు అనుగుణంగా పూర్తిగా మార్చేసారు. మాస్ .. మాస్ .. మాస్ .. కాని ఇది పవన్ కళ్యాణ్ మాస్ స్టైల్.

శృతిహసన్ ఎలా వుంది? ఎలా చేసింది?
పవన కళ్యాణ్ పక్కన బాగా సెట్ అయ్యింది. బాగా చేసింది.

సుహాసిని?
మదర్ గా బాగా సెట్ అయ్యింది. ఇంకా రెండు మూడు సెంట్ మెంట్ సీన్స్ పెట్టి వుంటే బాగుండేది.

కోట శ్రీనివాసరావు?
హిరోయిన్ తండ్రిని దబాంగ్ లో చంపినట్టుగా చంపేయకుండా, డిఫరెంట్ గా మంచి ఫీలే మెయింటేన్ చేసారు.

హైలట్స్ ఏమిటి?
ఈ సినిమాలో పంచ్ డైలాగ్స్ అన్నీ, అలీ ఒక పుస్తకంలో మెయింటేన్ చేస్తాడు. చివరికి ఆ పుస్తకం ఫుల్ అయిపోయి ప్రింటింగ్ కు ఇస్తాడు. ఒకటి రెండు హైలట్స్ అయితే చెప్పవచ్చు. మొత్తం సినిమా అంతా హైలట్స్ అయితే ఏమి చెపుతాం?

ఒకటి మాత్రం చెప్పాలని వుంది. గబ్బర్ సింగ్ స్టూడియోలో(పవన్ కళ్యాణ్ తన పోలిస్ స్టేషన్ కు పెట్టుకున్న ముద్దు పేరు గబ్బర్ సింగ్ స్టూడియో), రౌడిలతో ఆడించే అంత్యాక్షరి మొత్తం నవ్వి నవ్వి కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. too much and too good.

అబిమానులు కాని వాళ్లకు కూడా నచ్చుతుందా?
మాకు దూకుడు వచ్చింది, పవన్ కళ్యాణ్ కు కూడా పెద్ద హిట్ రావాలని మహేష్ బాబు అభిమానులు కోరుకుంటున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ రావాలని నందమూరి అభిమానులు కూడా విషెస్ తెలియజేస్తున్నారు. సో మెగా అభిమానులకు మాత్రమే కాదు, వేరే అభిమానులకు కూడా పిచ్చ పిచ్చగా నచ్చే అవకాశం వుంది. మాస్ ప్రేక్షకులకు మాత్రం ఇదో కొత్త రకం మాస్ సినిమా అని కచ్చితంగా చెప్పవచ్చు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.