ఆనందంలో మాటలు రావడం లేదు

‘గబ్బర్ సింగ్’ గురుంచి ఏదో ఒకటి వ్రాయాలి. ఏమి వ్రాయాలా అని ఆలోచిస్తుంటే ఏమీ రావడం లేదు. చివరికి వ్రాయడానికి ఏమి లేవు అని తెలుసుకున్నా. సినిమాలో అవి బాగోకపోతే అవి బాగోలేదు అనో, అవి లేకపోతే అవి లేవనో పేరాలు పేరాలు వ్రాయవచ్చు. రెండుసార్లు మించి నేను సినిమా థియేటర్ లో చూడలేదు. మినిమం పదిసార్లు చూడవలసిన సినిమా ‘గబ్బర్ సింగ్’ రూపంలో వచ్చింది. సౌండ్ లేకుండా చేసేసారు.

‘గబ్బర్ సింగ్’ ఎంచుకుంది పవన్ కళ్యాణ్. First thanks to him.

అద్భుతంగా ప్రెజెంట్ చేసిన హరీష్ శంకర్ కు Second thanks.

ఏమైనా పవన్ కళ్యాణ్ తో పెద్ద హిట్ తీయ్యాలన్న బండ్ల గణేష్ అలుపెరగని కష్టం. Next thanks to Him.

సినిమాకు ప్రాణం పోసిన దేవిశ్రీ ప్రసాద్ కు Special thanks.

మాటలు-మార్పులు-దర్శకత్వం:
మాటలు- 5/5
మార్పులు- 5/5
దర్శకత్వం- 5/5

ఈసారి పవన్ కళ్యాణ్ ‘హరీష్ శంకర్’ ను నమ్మాడు. ‘హరీష్ శంకర్’ ‘పవన్ కళ్యాణ్’ స్టైల్ ను నమ్మాడు. ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే సినిమా కాదు, అందరినీ అల్లాడించే సినిమా.

‘గబ్బర్ సింగ్’ – ఒక్కసారి మాత్రమే చూసే సినిమా కాదు:
‘సల్మాన్ ఖాన్’ దబాంగ్ చూడనోళ్ళకు ఎలా అనిపించిందో తెలియదు కాని, చూసిన నాకు మాత్రం ‘గబ్బర్ సింగ్’ రీమేక్ లా అనిపించలేదు. అంతా కొత్తదనమే. పవన్ స్టైల్ మాస్ ఏమిటో చూపించాడు హరీష్ శంకర్. సాంగ్స్ స్క్రీన్ మీద ఆడియో రేంజ్ లోనే వున్నాయి. ‘గబ్బర్ సింగ్’ – ఒక్కసారి మాత్రమే చూసే సినిమా కాదు . మినిమం పది సార్లు నాన్ స్టాప్ గా చూడవచ్చు. అదీను థియేటర్ లో చూస్తేనే ఆ మజా.

పూరీ జగన్నాథ్ పై ఒత్తిడి:
పూరీ జగన్నాథ్ పై ఒత్తిడి పెరిగింది. అల్లా టప్పా సినిమా కాకుండా, ‘గబ్బర్ సింగ్’ సినిమాను మించి వుండేలా తీయ్యాలి అని కోరుకుంటున్నా. ఈ సినిమాను ఎలా హైప్ చేస్తాడో చూడాలి.

తమ్ముడు తర్వాత బద్రి ఫ్లాఫ్ టాక్ తో మొదలయ్యి సూపర్ హిట్ అయ్యింది. కాని ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత ‘రౌడి అల్లుడు’, ఇంద్ర తర్వాత ‘ఠాగూర్’ మాదిరి పవన్ కళ్యాణ్ కు సూపర్ హిట్ బొమ్మ పడాలి.

తమ్ముడు తర్వాత పూరి ‘బద్రి’.
‘గబ్బర్ సింగ్’ తర్వాత పూరి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. కాని ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్థానం స్టాయి వేరు.

‘గబ్బర్ సింగ్’ సినిమాకు హరీష్ శంకర్ త్రివిక్రమ్ దగ్గర సలహాలు తీసుకున్నట్టు, పూరీ కూడా హరీష్ శంకర్ దగ్గర స్క్రిప్ట్ లో సలహాలు తీసుకోవడం బెటర్. పూరికి ఇగో వుండదు కాబట్టి ఆ పనిలోనే వుండి వుంటాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.