హట్సాఫ్ టు యంగ్ ఎన్.టి.ఆర్

Harish Shankar next film would mostly be with NTR. Even NTR reportedly loved the one-line narration that Harish Shankar gave to him some time back. The film might go to the sets toward the end of this year. – telugucinema.com

అందరి హిరోలతో పని చెయ్యాలనుకునే ఇండస్ట్రీలో ఎవరినైనా మీ అభిమాన హిరో ఎవరు అని అడిగితే నిజం చెప్పరు. దానికి కారణం 1) భయం అయ్యి వుండవచ్చు 2 ) లౌక్యం అని వారు అనుకొవచ్చు.

హరీష్ శంకర్ భయం లేకుండా, లౌక్యం తొక్క తోలు అని ఆలోచించకుండా “నేను పవన్ కల్యాణ్ వీరాభిమానిని” అని ఎప్పుడో డిక్లేర్ చేసేసాడు.

మనిషికి లౌక్యం, భయం కాదు వుండాల్సింది. వాటి కంటే ముందు నిజాయితీ, ధైర్యం:
మీరు ఎవరు అభిమానైనా ధైర్యంగా చెప్పుకొవడం భయపడక్కర్లేదు. మనిషికి కావల్సింది నిజాయితీ. ఎవరు అభిమానైనా నాతో పని చెయ్యాలనుకున్నప్పుడు నాకెటువంటి అభ్యంతరాలు వుండవు. నాలో ఎటువంటి ఇగో లేదు అని యంగ్ ఎన్.టి.ఆర్ మాటల్లో కూడా చేతల్లో చూపిస్తున్నాడు. తాను తర్వాత చెయ్యబోయ సినిమాకు పవన్ కల్యాణ్ ని దేవుడిగా భావించే నిర్మాతా బండ్ల గణేష్.

అంతే కాదు, పదేళ్ళ నుంచి పవన్‌కు పవన్ అభిమానుల మధ్య రోజుకు రోజుకు పెరుగుతున్న కన్‌ఫ్యూజన్ గ్యాప్‌ను ’గబ్బర్‌సింగ్’ తో ఫిల్ చేసిన పవన్ కల్యాణ్ వీరాభిమాని హరిష్ శంకర్ కు కూడా అవకాశం ఇవ్వడం నిజంగా ఎన్.టి.ఆర్ కు హాట్సాఫ్.

ఒక అభిమానికి అభిమానులు ఏమి కోరుకుంటారో బాగా తెలుస్తుంది. హరీష్ శంకర్ ఎన్.టి.ఆర్ అభిమానులు కోరుకునే సినిమా అందించి విజయబాటలో సాగాలని కోరుకుందాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.