మాటలు-మార్పులు-దర్శకత్వం హరీష్ శంకర్

‘గబ్బర్ సింగ్’ సినిమా పవన్ కళ్యాణ్ కు పూర్వ వైభవాన్ని తేవడమే కాదు, మెగా అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపింది. కేవలం మెగా అభిమానులలో మాత్రమే కాదు, తెలుగు ప్రేక్షకులందరిలోను సినిమాలపై ఆసక్తిని పెంచింది.

ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం పవన్ కళ్యాణ్ కు నిజంగానే కొద్దిగా తిక్క(ఎవరికి హాని కలిగించని) అనే ఇమేజ్ వుండటం. ఆ తిక్క క్యారెక్టరైజేషన్ కు లెక్క వుందంటూ కరెక్ట్ జస్టిఫికేషన్ డైలాగ్స్ ద్వారా చెప్పించడం.

దబాంగ్ అసలు మార్పులు లేకుండా తీసివుంటే తమిళ్ లో మాదిరి షెడ్ కు వెళ్ళేది. పవన్ కళ్యాణ్ కు అనుగుణంగా మార్పులు చేస్తే హిట్ గ్యారంటీ. కాని సినిమా సూపర్ హిట్ అయ్యి కూర్చుంది. ఈ సూపర్ హిట్ కు కారణం కచ్చితంగా హరీష్ శంకర్ చేసిన మార్పులే.

సాదా సీదా డైరక్టర్ ‘హరీష్ శంకర్’ ఏమి మార్పులు చేసి వుంటాడులే అనుకున్నారు. కాని చేసిన మార్పులు చూసిన తర్వాత జనాలకు ఆనందంతో మైండ్ బ్లాక్ అయ్యింది.

గబ్బర్ సింగ్ సినిమాతో: ఏ హిరోతో నైన మినిమం హిట్ ఇవ్వగల దర్శకుడిగా అగ్ర దర్శకుల లిస్టులో చేరిపోయాడు.
రాజమౌళి
వి.వి.వినాయక్
పూరి జగన్నాథ్
శ్రీను వైట్ల
హరీష్ శంకర్

Heartly Contratulations to Harish Shankar.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.