జగన్ ను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?

సాక్షిలో రాజకీయంగా చిరంజీవిని ఎన్ని విమర్శలు చేసినా నాకు బాద కలిగించదు. కాని గీత దాటితే మాత్రం కోపం వస్తాది, కాంగ్రెస్ అక్కున చేరి చిరంజీవి చేసింది ఏముందిలే అని సముదాయించుకుంటాను. నేను జగన్ ను సపోర్ట్ చెయ్యడానికి కారణం, రాజకీయలలో నేను చిరంజీవిని నుంచి ఏమి ఆశించానో అవి జగన్ చేసి చూపిస్తున్నాడు.

సమాజంలో చెడును మంచితో ఎదుర్కునే రోజులు కావివి. ముల్లును ముల్లుతోనే తీయ్యాలనే సామెత ఎలానో చెడును చెడుతోనే ఎదురు చెప్పవలసిన అవసరం ఏర్పడింది.

దుష్ట అవినీతి కాంగ్రెస్ ఎంత రెచ్చిపోతే అంతే ఇదిగా జవాబు చెప్పగల సమర్దుడు జగన్.

రాజకీయ నాయకులలో ఎవడు అవినీతి పరుడు కాదు? బిజినెస్ లో మోసం చెయ్యకుండా, అందిన కాడకు వెనకేసుకొని వ్యాపారస్తులు వుంటారా? (in my world less than 5%).

ప్రజలు అవకాశం ఇచ్చారు. వెనకేసుకున్నాడు. జగన్ వెనకేసుకోకపోతే రాష్ట్రం ముఫై ఏళ్ళు ముందుకు వెళ్లేదా? కాంగ్రెస్ కు ఎదురు తిరిగాడు కాబట్టి, అధికార బలం చూపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులంతా అవినీతి పరులు కాదా?

జగన్ మరో లక్ష కోట్లు వెనకేసుకున్నా నాకు లాభం/నష్టం లేనప్పుడు, జగన్ కాకపొతే బొత్సా .. బొత్సా కాకపొతే చంద్రబాబు .. చంద్రబాబు కాకపొతే చిరంజీవి .. చిరంజీవి కాకపొతే కిరణ్ కుమార్ రెడ్డి .. ఎవరో ఒకరు దోచుకునేదే కదా?

అనుక్షణం జనాల్లోనే తిరుగుతూ, వెనకేసుకున్న డబ్బు విదేశాలకు తరలించకుండా ఎంతో మందికి ఉపాధి కలిపిస్తున్న జగన్, ఇప్పుడు వున్న రాజకీయ లుచ్చాల కంటే ఎంతో మేలు.

చిరంజీవి మాదిరి కాంగ్రెస్ కు లొంగకుండా కాంగ్రెస్ పై పోరాటం సాగిస్తూ కాంగ్రెస్ పెద్దలకు పెద్ద గుణపాటం చెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నాను.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.