మనిషనే ప్రతోక్కరికి కొద్దిగా తిక్క వుంటుంది

‘గబ్బర్ సింగ్’ సినిమా మొదటి రోజా? పదో రోజా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటి రోజు ప్రేక్షకులు ఎంత ఉత్సాహంగా సినిమా కోసం ఎగబడతారో, పదో రోజు ప్రేక్షకులు కుడా సినిమా చూడాలని అంతే ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.

“గబ్బర్‌సింగ్” – ఇంత ఘనవిజయం సాధించడానికి కారణం ఏమిటని తెలుగుసినిమా మేధావులు తలలు బ్రద్దలు కొట్టుకుంటున్నారు. ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చితే సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అయిపోవు. 5 to10 % తప్ప, మిగతా వాళ్ళల్లో చూసిన ప్రతిఒక్కరూ ఇది నా సినిమా నాకు సంబంధించిన సినిమా అనుకున్నప్పుడే ఇటువంటి విజయాలు సాధ్యం.

పవన్‌కల్యాణ్ ఈ సినిమా చెయ్యడానికి కారణం హిరో తిక్క క్యారెక్టరైజషన్ – స్టోరి
పవన్‌కల్యాణ్ కు కొద్దిగా తిక్క అనే ఇమేజ్ – పవన్‌కల్యాణ్
తిక్కకు ఒక లెక్క అని కరెక్ట్ జస్టిఫికేషన్ ఇవ్వడం – హరిష్ శంకర్
మ్యూజిక్ – దేవిశ్రీ ప్రసాద్
ప్రొడక్షన్ వాల్యూస్ – బండ్ల గణేష్

పవన్‌కల్యాణ్ కు ఆవేశం ఎక్కువ అనే టాక్ పబ్లిక్‌లో వుంది. కాని నాది ఆవేశం కాదు ఆవేదన అంటాడు పవన్‌కల్యాణ్. మన ఆవేశాన్ని/ఆవేదన్ని మనలోనే దాచుకోక బయటకు ప్రదర్శిస్తే ఆ మనిషికి కొద్దిగా తిక్క అనే ముద్ర పడుతుంది. ప్రతి మనిషిలోను ఆవేశం/ఆవేదన వుంటుంది. కొందరు పబ్లిక్‌లో ప్రదర్శించక పొయినా ఎదో ఒక సమయంలో ఎక్కడొక చోట ప్రదర్శిస్తారు.

ఈ విధంగా లెక్కతో కూడిన తిక్కకు ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యారు. ప్రతి మనిషిలో వుండే లెక్కతో కూడిన తిక్కే మళ్ళీ మళ్ళీ ఈ సినిమాను చూసేలా చేస్తుంది. నాగేంద్ర బాబు చెప్పినట్టు ఒక సినిమాకు ఇలా అన్నీ కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది.

BTW, రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ అదుర్స్:

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.