రాజమౌళి ‘ఈగ’ ఇంకో నెల ఆగి వస్తే బెటర్

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే మినిమం ఒక సంవత్సరం పాటు సెట్స్ మీద వుండేది. కారణం ఏమిటని అడిగితే క్వాలిటీ కోసం నాకు అంత టైం కావాలని పవన్ కళ్యాణ్ చెప్పేవాడు. కాని ఇప్పుడు నాలుగు నెలలలో సినిమాలు చేసేస్తున్నాడు. గతంలో లా రీ షూటింగ్ లాంటివి చెయ్యడం లేదు. ‘గబ్బర్ సింగ్’ క్లైమాక్స్ రసపట్టుగా లేకపోవడానికి కూడా ఈ పాస్ట్ నెస్ ఒక కారణం. విలన్ పై పగను కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేసి వుంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేదంటున్నారు.

ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కు వుండే అలవాటు ఇప్పుడు రాజమౌళికి పాకింది. క్వాలిటీ క్వాలిటీ అంటూ సంవత్సరం పైనే ‘ఈగ’ కోసం కష్టపడ్డాడు.

అంత కష్టపడి రాంగ్ టైమ్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నాడో అర్దం కావడం లేదు. ముందు అనుకున్న టైం ప్రకారం రచ్చకు ముందు రిలీజ్ అయ్యి వుంటే కలక్షన్స్ దుమ్ము దులిపేది.

రాంగ్ టైం ఎందుకు అంటున్నాను అంటే:
1) ‘గబ్బర్ సింగ్’ హవా .. ఈ సమ్మర్ లో సినిమాలకు కేటాయించుకున్న బడ్జెట్ ను, జనాలు ‘గబ్బర్ సింగ్’ కోసం ఖర్చు పెట్టేస్తున్నారు
2) నెక్స్ట్ నెల ఎలక్షన్స్ . మీడియా పోకస్ అంతా అటు వైపే వుంటుంది.

SO, రాజమౌళి ‘ఈగ’ ఇంకో నెల ఆగి వస్తే బెటర్.

రాజమౌళి లక్ష్యం నచ్చింది:
ఈ సినిమా ద్వారా రాజమౌళి ఏమి సాధించాలనుకున్నాడో నాకు మొన్నటి దాకా అర్దం కాలేదు. అది తెలిసాక రాజమౌళి లక్ష్యం నచ్చింది.

ఈ సినిమా ద్వారా ఇతర బాషలలో కూడా రాజమౌళి స్టాంప్ కు డిమాండ్ రావాలనుకుంటున్నాడు.

తెలుగు సినిమాలకు వేరే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో డిమాండ్ వస్తే సూపర్. అంకుశం, శివ లాంటి డబ్బింగ్ హిట్స్ ఇప్పుడు తమిళ్ లో పడితే తెలుగు సినిమా మార్కెట్ తమిళ్ లో పుష్కలంగా పెరుగుతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.