ఎన్.టి.ఆర్ ‘బాద్‌షా’ మెగాహిట్ కావాలని కోరుకుంటున్న మెగాఅభిమానులు

Ram Charan ‏@Alwayscharan
Wishin my friends tarak and trisha.. All the best!!! I heard tarak’s performance was intense. GRT goin guys..

దమ్ము సినిమా తర్వాత రామ్‌చరణ్ చేసిన ట్వీట్ అది. దమ్ము సినిమా అనుకున్నంత కమర్షియల్ రేంజ్ రాకపొయినా ఎన్.టి.ఆర్ పెరఫార్మన్స్ అదుర్స్ అని టాక్ సంపాదించుకుంది.

ఎన్.టి..ఆర్ , చరణ్ ఇప్పుడు మంచి ఫ్రెండ్స్. ఎన్.టి.ఆర్ ‘బాద్‌షా’ కు క్లాప్ కొట్టింది చరణే.

ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ కూడా మెగాహిట్ కావాలని మెగాఅభిమానులు కోరుకుంటున్నారు. దానికి కారణం తెలుగుసినిమా చరిత్రలో 10కోట్లు షేర్ సాధించిన మొదటి చిత్రం ‘ఘారానా మొగుడు’. ఆ సినిమాకు క్లాప్ కొట్టింది నందమూరి బాలకృష్ణ. SO ‘ఘారానా మొగుడు’ సినిమాలా ఎన్.టి.ఆర్ ‘బాద్ షా’ కూడా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నారు. అంతే కాదు మరో కారణం కూడా వుంది. పవన్ అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత కావడం.

దర్శకుడు శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్ ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్కు పూర్తి చేశారు. దూకుడు సినిమాకు పని చేసిన సాంకేతిక బృందం మొత్తం ‘బాద్ షా’ చిత్రానికి పని చేయనున్నారు. సినిమా మొత్తం యాక్షన్ అండ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ హీరోయిన్‌. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.