ఈగ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా

అపజయమెరగని దర్శకుడు రాజమౌళి తాజా చిత్రం ‘ఈగ’. ఈ నెల 30 న విడుదల అవుతున్నట్టుగా ఎనౌన్స్ చేసారు. భారీ వ్యయంతో,పెద్ద హీరోలెవరూ లేకుండా చిత్రం తీసి రిలీజ్ చేయటం అందరిలో ఆసక్తి నింపుతోంది. డి.సురేష్‌బాబు సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రేమ వల్ల ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు పగతో ‘ఈగ’లా పుట్టి తన పగను ఎలా తీర్చుకున్నాడనే కధతో రూపొందిన సైంటిఫిక్ ధ్రిల్లర్ ఇది.

తెలుగుసినిమా హీరోల మధ్య, దర్శకనిర్మాతల మధ్య మంచి అండర్ స్టాండింగ్ వుంది. పెద్ద సినిమాలంటే మినిమమ్ రెండు వారాలు గ్యాప్ వుండేలా చూసుకుంటున్నారు. అదే విధంగా ఈగ సినిమాను ‘గబ్బర్ సింగ్’ సినిమాకు రెండు వారాల తర్వాత ప్లాన్ చేసుకున్నారు.

కాని ‘గబ్బర్ సింగ్’ రెండో వారం కలక్షన్స్ కూడా మొదటి వారానికి ఏ మాత్రం తక్కువ వుండకపోవడంతో, ‘ఈగ’ సినిమా వచ్చి ఎక్కడ తగ్గిస్తుందోనని ఒక వర్గం అభిమానులు బెంగ పెట్టుకున్నారు.

ఈగ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడి, వారికి బెంగ లేకుండా చేసింది. ఈగ వాయిదా పడటానికి కారణం CGI వర్క్ ఇంకా పూర్తి కాలేదు.

“For every film enthusiast out there who have been waiting for Eega, I apologise as we are not releasing on 30th of this month. I know it is disappointing. I am disappointed myself. We underestimated the amount of time for CG. I am extremely happy with the quality of CG 4 the shots we received so far. I want to ensure the same quality is maintained for the rest. Everyone is working 24/7 to get d film out ASAP Hope U’ll excuse :)” – RAJA MOULI

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.