‘గబ్బర్ సింగ్’ ఘన విజయంలో వాటాలు ఎంతెంత?

ఖుషి సినిమా తర్వాత పవన్ ఇమేజ్ కు తగ్గట్టు, పవన్ స్టామినా తెలియజెప్పే సినిమాగా ‘గబ్బర్ సింగ్’ ను వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరూ అభివర్ణిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ పంజా ఆడియో పంక్షన్ లో చెప్పాడు, సినిమా అనేది ‘సమిష్టి కృషి’ అని. పవన్ కళ్యాణ్ చెప్పాడు అని కాదు, ఒకప్పుడు క్రెడిట్ అంతా హిరోకే చెందేది. ప్రేక్షకులు తెరవెనుక వ్యక్తుల గురుంచి అసలు పట్టించుకునే వారు కాదు. కాని ఇప్పుడు ప్రేక్షకుల స్థాయి పెరిగి తెరవెనుక వ్యక్తుల గురుంచి కూడా బాగా డిస్కషన్స్ చేసుకుంటున్నారు. హీరోకు మంచి దర్శకుడు తోడైతే ఓపినింగ్స్ లో భారీ తేడా కనపడుతుంది.

గబ్బర్ సింగ్’ ఘన విజయంలో వాటాలు ఎంతెంత?
1) పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే నటనలో విశ్వరూపం ప్రదర్శించాడు. ఇటువంటి నటన ‘గుడుంబా శంకర్’ లో ఎప్పుడో చేసాడు. తను చేసిన మాస్ సినిమాలు ‘బంగారం’, ‘అన్నవరం’, ‘పులి’ విజయం సాధించక పోయినా, ఆ సినిమాల ద్వారా వచ్చిన మాస్ ఇమేజ్, అనుభవం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. ఈ సినిమాలో అసలు ఎఫర్ట్ లేకుండానే చేసినట్టు అనిపించింది. సరైన సబ్జక్ట్ ఎంచుకున్నందుకు పవన్ కళ్యాణ్ కు 50/100 మార్కులు.

2) మిగతా 50 మార్కులు హరీష్ శంకర్ కే. ‘గుడుంబా శంకర్’ లో పవన్ కళ్యాణ్ గెటప్ కు, యాక్షన్ కు కరెక్ట్ జస్టిఫికేషన్ మిస్ అయ్యింది. అది కరెక్ట్ చేసి పరఫక్ట్ గా తీసాడు. బండ్ల గణేష్, దేవిశ్రీ ప్రసాద్ నుంచి ఏమి కావాలో అది కరెక్ట్ గా తీసుకున్నాడు హరీష్ శంకర్.

పవన్ కళ్యాణ్ పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టింది. హరీష్ శంకర్ స్టార్ డైరక్టర్ గా మారిపోయాడు. బండ్ల గణేష్ నెం 1 నిర్మాతగా మూవ్ అవ్వడానికి పునాది వేసుకున్నాడు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.