గబ్బర్ సింగ్ కు హిరో రామ్ ప్రశంసలు

మనకున్న తెలుగుహిరోలలో అందం కూడా వున్న హిరో రామ్. చాలా సార్లు పవన్ కళ్యాణ్ లా చేస్తున్నాడు అనిపిస్తూ వుంటుంది. దానికి కారణం ఎనర్జిటిక్ గా చెయ్యడం. తెలుగు తెర మీద ఎక్కువ ఎనర్జిటిక్ గా కనిపించే హిరో ‘పవన్ కళ్యాణ్’. కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రభావం లేని ఎనర్జిటిక్ హిరో వుండడు. దానిని ఒక ప్రశంసగా రామ్ ఫీల్ అవుతుంటాడు.

నాకు సినిమా ఊహ తెలిసిన దగ్గరనుండి, ప్రేక్షకుల నీరాజనాలతో పాటు తెలుగుసినిమా ఇండస్ట్రీలో సినిమా వాళ్ళను కూడా కదిలించి ఓపన్ గా సినిమా కెవ్వు కేక(ఏదో చెప్పాలని చెప్పినట్టు కాకుండా) అని చెప్పిన సినిమాలు చాలా చాలా అరుదు. వాళ్ళను పొగిడితే వీళ్ళకు, వీళ్ళను పొగిడితే వాళ్ళకు కోపం వస్తుందని అని పబ్లిక్ గా ఎవరినైనా పొగడటానికి సినిమావాళ్ళు దూరంగా వుంటారు. ఇలా సినిమావాళ్ళు పబ్లిక్ గా మనస్పూర్తిగా ఒక సినిమాపై పొగడ్తల వర్షం చిన్నప్పుడు “అమ్మోరు” సినిమాకు చూసాం. మొన్న ‘మగధీర’. ఈరోజు ‘గబ్బర్ సింగ్’.

గబ్బర్ సింగ్ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ పై రామ్ చేసిన పవర్ పంచ్ డైలాగ్ అదిరింది.

ఒక స్టార్ కి పవర్ వుంటే ఒకలా వుంటుంది .. అదే ఒక పవర్ కు స్టార్ ఇమేజ్ వుంటే ‘గబ్బర్ సింగ్’ లా వుంటుంది – హిరో రామ్

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.