ప్రజలను అవమానిస్తున్న ప్రభుత్వం

ప్రజలచే అత్యధిక మెజార్టీతో గెలిపొందిన ఒక ప్రజా ప్రతినిధి తమ పార్టీకే పోటిగా తయారయ్యాడని
ప్రజా స్వామ్య పద్దతిలో ఎదుర్కొనలేక
తమకున్న అధికారాలను విచ్చల విడిగా దుర్వినియోగం చేస్తూ
మరో రెండు వారాలలో ఎన్నికలు పెట్టుకొని
ఆ ఎన్నికలలో ప్రచారం చేసుకునే విలువైన సమయాన్ని జైల్లో దిగ్భధం చెయ్యడం
ప్రజలకు
ప్రజాతీర్పుకు జరుగుతున్న తీవ్ర అవమానంగా
ప్రజలు
భావిస్తున్నారు.

రాజకీయాల ద్వారా ఆర్దిక నేరాలకు పాల్పడటం కొత్త కాదు. జగన్ మొదటి వాడు కాదు. రాజకీయాల ద్వారా ఆర్దిక నేరాలకు పాల్పడిన వాళ్ళను జైల్లో పెట్టడం మొదలు పెడితే మన జైళ్ళు సరిపోవు. తమకు ఎదురు తిరిగిన వాళ్ళను మాత్రమే కక్షతో జైలు పాలు చెయ్యడం అమానుషం.

ప్రజలే మాకింత ఇచ్చి , మీరు ఎంతైనా దోచుకోవచ్చు అని స్పష్టమైన తీర్పు ఇచ్చినపుడు, ప్రజా స్వామ్యాన్ని అగౌరవ పరుస్తూ ఇటువంటి చర్యలు చేపట్టడం చాలా దురదృష్టకరం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in రాజకీయాలు, Xclusive. Bookmark the permalink.