బన్నీ ‘జులాయి’ కూడా సూపర్ హిట్

IPL మ్యాచ్ లకు తోడు, ఇటు సినిమాలలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ప్రభంజనం. అటు రాజకీయాలలో జగన్ పై రాజకీయ దాడులు. ఈ హడావుడిలో ఎవరూ సినిమాలు రిలీజ్ చేయ్యడం లేదు. ఇప్పుడే IPL మ్యాచ్ లు ముగిసాయి కాబట్టి, ఇప్పుడు ఒక దాని తర్వాత మరొకటి వచ్చే ఛాన్స్ వుంది.

రచ్చ, గబ్బర్ సింగ్ సినిమాలతో పాటు ఈ సంవత్సరంలో మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా బన్నీ ‘జులాయి’. ఈ సినిమాకు మెగా అభిమానులతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ అభిమానులు కూడా తోడవ్వడం పెద్ద ప్లస్. త్రివిక్రమ్ కు బన్నీ ఎనర్జీ తోడయ్యి రైట్ గా సెట్ అయితే అమెరికాలో ఒక సంచలనం సృష్టించడం ఖాయం అంటున్నారు.

బన్నీ-దేవిశ్రీ కాంబినేషన్ కు త్రివిక్రమ్ తోడయ్యాడు కాబట్టి, ‘గబ్బర్ సింగ్’ తో మంచి ఊపు మీద వున్న దేవిశ్రీ ‘గబ్బర్ సింగ్’ ను మించిన ఆడియో ఇచ్చే అవకాశం వుంది. బన్నీ ‘జులాయి’ కూడా సూపర్ హిట్ గ్యారంటీ అని అంటున్నారు. ప్రస్తుతం ‘జులాయి’ సినిమా గురుంచి ఏమి మాట్లాడుకోక పోయినా, ఆడియో వచ్చాక సినిమాపై మంచి హైప్ వచ్చే ఛాన్స్ వుందంటున్నారు.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.