‘జులాయి’ ఓవరసీస్ కలక్షన్స్ పైనే అందరి దృష్టి

ఏదో ఆడియో ఫంక్షన్ లో తారక్ తో మీ సినిమా ఎప్పుడేప్పుడని అని రాజమౌళిని అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఇచ్చిన సమాధానం:

నేను, వినాయక్ తారక్ తో సినిమా అంటే హిట్ కోసం పని చెయ్యం. తారక్ లో ఒక కొత్త కోణాన్ని అవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. – యస్.యస్.రాజమౌళి

వారి ప్రయత్నాలలో ఎంత సఫలీకృతులయ్యరన్నది వేరే సబ్జక్ట్. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రం నటనా పరంగా మహేష్ బాబుకు ఒక చక్కని మార్గం సెట్ చేసాడు.

అతడు: ఒక ప్రత్యేక పద్దతిలో డైలాగ్ చెప్పి ఒక సీన్ ను పండించడం ద్వారా మహేష్ బాబును ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో, దర్శకులు ఎలా చూపించాలో తెలియ చెప్పిన సినిమా ‘అతడు’.

ఖలేజ: మహేష్ బాబు ఇలా మాత్రమే చేస్తే ప్రేక్షకులు చూస్తారు అనే ఇమేజ్ కు బ్రేక్ ఇచ్చి, మహేష్ బాబులోని ఎనర్జిటిక్ హిరో ను తీసుకోచ్చిన సినిమా ‘ఖలేజ’.

మహేష్ బాబును కొత్తగా చూపించడం ఒక ఎత్తు అయితే, ఒవరిసీస్ లో బిగ్ ఇమేజ్ తీసుకోచ్చిన సినిమా ‘అతడు’. సో ..

బన్నీ .. C/O ఎనర్జీ అంటూ వుంటారు. ఎన్.టి.ఆర్, చరణ్ అభిమానులు సైతం బన్నీ డాన్సస్ లో బెస్ట్ అని మెచ్చుకుంటారు. కానీ .. ఈ మధ్య వచ్చిన బన్నీ సినిమాలకు ఏదో చిన్న తప్పిదం జరుగుతూ వస్తుంది. ఏదో ఒక చిన్న కారణం చేత అందరి చేత శభాష్ అని పించుకోలేక పోతున్నాడు. చిన్న చిన్న తప్పిదాలకు, బ్యాడ్ లక్ కు ‘జులాయి’ బ్రేక్ ఇస్తుందని ఆశీస్తున్నారు.

ఈ సినిమా లక్ష్యాలు:
1) రచ్చ, గబ్బర్ సింగ్ మెగా హిట్స్ . .. జులాయి మెగా హిట్ తో హ్యాట్రిక్ సాధించాలి.
2) ఓవరసీస్ లో త్రివిక్రమ్ కు వున్న ఇమేజ్ కు , బన్నీ తోడయ్యి భారీ కలక్షన్స్ సాధించాలి.
3) త్రివిక్రమ్ సహాయంతో ప్రేక్షకులు కోరుకునే విధంగా మెప్పించడం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.