అక్టోబర్ 18న వస్తే కెవ్వు కేకే

అభిమానులు తమ హిరో సినిమా సంవత్సరానికి ఒక్కటన్నా వస్తుందా రాదా అని అనుకునే రోజులు పోయాయి. ప్రతి హిరో సంవత్సరానికి మినిమమ్ రెండు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. సినిమాలు ఎక్కువై పోయాయి. థియేటర్స్ దొరకాలి అంటే సినిమా రిలీజ్ పక్కా ప్లానింగ్ తో వుండాలి.

పూరి జగన్నాథ్ మహేష్ బాబు తో బిజినెస్ మేన్ సినిమా రిలీజ్ డేట్ ముందే ఎనౌన్స్ చేసి,షూటింగ్ అనుకున్నది అనుకున్నట్టుగా ఫినిష్ చేసి, ఆ సీజన్ లో వేరే భారీ సినిమాలు లేకుండా చేసుకొని, భారీ ఓపినింగ్స్ ను సాధించారు. ఇప్పుడు అదే టెక్నిక్ పవన్ కళ్యాణ్ ‘కెమెరామేన్‌ గంగతో రాంబాబు’ తో ఉపయోగిస్తున్నాడు. సినిమా పూజా కార్యక్రమాల రోజే అక్టోబర్ 18న రిలీజ్ అని ఎనౌన్స్ చేసాడు.

కాని ఈసారి అదే సమయంలో రిలీజ్ కాబోతున్న మహేష్ బాబు-దిల్ రాజు, రామ్ చరణ్-వినాయక్, ఎన్.టి.ఆర్-శ్రీను వైట్ల సినిమాలు ఈ సినిమా పై ఎటువంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఈ రిలీజ్ డేట్ ను బట్టి ఆ రిలీజ్ డేట్స్ ఎలా ఎడ్జస్ట్ చేస్తారో చూడాలి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.