‘దేవుడు చేసిన మనుషులు’ సాంగ్స్ అదరహో

నాకు పూరి జగన్నాథ్ సినిమాలు బాగా నచ్చుతాయి. ‘బుజ్జిగాడు’ సినిమా ఎన్నిసార్లు చూసానో లెక్కలేదు. ‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా మాత్రం అసలు చూడాలని అనిపించడం లేదు. మొదటి కారణం రవితేజ రొటీన్ యాక్షన్ అయితే, రెండో కారణం దేవుడిని ఎక్కడ వెటకారం చేసాడో అని భయం.

ట్రైలర్స్ లో విజువల్స్ బాగోలేదు కాని, ఒక మాస్ ప్రేక్షకుడిగా ‘దేవుడు చేసిన మనుషులు’ సాంగ్స్ అదరహో అన్న రీతిలో అనిపించాయి.

‘సుబ్బలక్ష్మి’, ‘దేవుడా దేవుడా’, ‘డిస్టర్బ్ చేత్తున్నాడే’ – మాస్ సాంగ్స్ – మరీ లౌడ్ గా అనిపించాయి. క్లాస్ కు నచ్చకపోవచ్చు కాని, మాస్ కు మంచి కిక్ ఇచ్చే సాంగ్స్.

‘ఏమి సేతురా’, ‘నువ్వంటే చాలా ఇష్టం’ సాంగ్స్ — క్లాస్ కు కూడా నచ్చే సాంగ్స్.

‘నువ్వేలే నువ్వేలే’ – క్లాస్ సాంగ్ .. పాత పాటలా వుంది.

పాటలు మాస్ కు నచ్చినా, మరో రవితేజ సినిమా అని ఫ్లోలో వచ్చి వెళ్లి పోయే సినిమా అవుతుందేమో. ఎందుకో సంచలనాలు సృష్టించే సినిమాలా అనిపించడం లేదు. రవితేజ బదులు upcoming హిరో ను సెలెక్ట్ చేసుకొని వుంటే సినిమాకు క్రేజ్ వచ్చేది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.