ఈగకు భయపడనంటున్న జులాయి

జులాయి ఆడియో – because of very high expectations, audio is not up to my expectations. వినగా వినగా మూడు సాంగ్స్ నచ్చాయి. లిరిక్స్ సంభాషణల మాదిరి వుండటం వలన కిక్ రావడం లేదు. వెండి తెరపై చూసాకే పాటల అసలు రేంజ్ తెలుస్తుంది. ఈ విధంగా ఆడియో వచ్చాక సినిమాపై కూడా అంచనాలు తగ్గాయి.

త్రివిక్రమ్ సినిమాలు నచ్చకపోవడం అంటూ వుండదు. అనుమానం లేకుండా చూడవచ్చు అనే నమ్మకం వుంది. నిన్న జులాయి ప్రెస్ మీట్ చూసాక సినిమాపై నమ్మకం పెరిగింది. జులాయి బన్నీని కొత్త కోణంలో చూపించే సినిమా మాత్రమే కాదు, త్రివిక్రమ్ కూడా మాటలు కొత్తగా ట్రై చేసాడు అంట.

బన్నీ తన సినిమాల ఎంపికలో పవన్ కళ్యాణ్ కు పూర్తి వ్యతిరేకం అన్నట్టు. పవన్ కళ్యాణ్ తన దగ్గరకు వచ్చిన దర్శకులతో తాను చెయ్యాలకున్న పాయింట్స్ చెప్పి సినిమాగా మార్చమంటాడు.

తండ్రి భారీ నిర్మాత మాత్రమే కాదు, సినిమా థియేటర్స్ చేతిలో వుండటం వలన: బన్నీ అదృష్టం ఏమిటంటే, తన దగ్గరకు వచ్చినా రాకపోయినా, తాను అనుకున్న డైరక్టర్ ను మొహమాటం లేకుండా అడిగేసి వాళ్ళతో సినిమా చెయ్యగల్గడం(no ego, down to earth అంటే ఇది). కరుణాకరన్ తో ‘హ్యాపి’, పూరితో ‘దేశముదురు’, గుణశేఖర్ తో ‘వరుడు’, వినాయక్ తో ‘బన్నీ’ ‘బద్రినాథ్’, క్రిష్ తో ‘వేదం’ .. అలా ఇప్పుడు త్రివిక్రమ్ తో జులాయి.

సినిమా మినిమం ఎవరేజ్ to హిట్ గ్యారంటీ.. butఈ సినిమాకు ఒకే ఒక డ్రాబ్యాక్: బన్నీ-ఇలియానా కాంబినేషన్. వీరద్దరి కెమిస్ట్రీ బాగుందా లేదా, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దానిపైనే సినిమా రేంజ్ ఆధారపడి వుంది. బన్నీ-ఇలియానా కాంబినేషన్ దమ్ములో ఎన్.టి.ఆర్ త్రిషా కాంబినేషన్ లా వుంటే జులాయి సినిమా షెడ్ కే.

ఈగకు భయపడనంటున్న జులాయి:
ఈగ సినిమాకు వారం రోజులు తేడాలో రిలీజ్ చెయ్యడం పెద్ద సాహసమే. మగధీర సినిమా ద్వారా రాజమౌళి కూడా ఓవర్ సీస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. త్రివిక్రమ్ ఓవర్ సీస్ లో నెం 1 డైరక్టర్. సో ఈ సినిమాల కలక్షన్స్ ఓవర్ సీస్ లో ఎలా వుండబోతున్నాయి అనేది ఇంటరెస్టింగ్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.