అరుంధతి vs ఈగ

అరుంధతిలో విలన్ క్రూరమైన ఘోరమైనా కామాంధుడు.
ఈగ సినిమాలో విలన్ డబ్బు కోసం భార్యను చంపేసి, హిరోయిన్ కోసం హిరోయిన్ ప్రేమికుడిని క్రూరంగా చంపేస్తాడు.

అరుంధతిలో హిరోయిన్నే మరో జన్మ ఎత్తి విలన్‌ను చంపుతుంది,
ఈగలో హిరోయిన్ ప్రేమికుడు ఈగగా పుట్టి విలన్‌ను చంపుతాడు.

అరుంధతి సినిమా పెద్దలకు మాత్రమే. ఈగ సినిమా మాత్రం పెద్దలు కూడా మెచ్చే చిన్న పిల్లల చిత్రం.

అరుంధతి సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. క్లాస్ ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించారు.

తెలుగులో అరుంధతి రేంజ్‌లో ఈగ కలక్షన్స్ సాధిస్తే, ప్రేక్షకులకు ఆకట్టుకొవడానికి అరుంధతి సినిమాలో వున్నంత క్రూరత్వం అవసరం లేదని మాస్ ప్రేక్షకులు చెప్పినట్టే.

for me, ఈగ >>>>>>>>> అరుంధతి.

పిల్లలతో హాయిగా చూస్తూ, హాయిగా నవ్వుకుంటూ బయటకు వచ్చే సినిమా ’ఈగ’.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.