ఆగష్టు 3న మా ‘జులాయిలు’

అల్లు అర్జున్ జులాయి రిలీజ్ ఆగష్టు 9కి వాయిదా వేసారు. తెలుగువాళ్ళందరూ ఇది మా తెలుగుసినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అటువంటి సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించడం అనేది ఇంకా అరుదు. ఆ ఫీట్ ను సాధించిన సినిమా రాజమౌళి ‘ఈగ’. అటువంటి సినిమాను గౌరవిస్తూ మరో పెద్ద సినిమా జులాయి వాయిదా వేసుకోవడం తెలుగుసినిమా పరిశ్రమలో పెద్దల మధ్య వున్న మంచి సంబంధాలను తెలియజేస్తుంది.

ఈగ సినిమా రిలీజ్ అయిన మరో వారానికే జులాయి సినిమా రిలీజ్ అంటే ఎవరూ నమ్మలేదు(atleast me). మేకర్స్ మాత్రం జూలై 13నే రిలీజ్ అని నొక్కి వక్కాణించండం వలన,. ఈగకు భయపడి జులాయిని పోస్ట్ పోన్ చేసారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ శుభ సందర్భంగా ఆగష్టు 3న మా రెండో షార్ట్ ఫిలిం జులాయి ప్రమోషన్ కోసం ‘జులాయిలు’ సిద్ధం చెయ్యాలను కుంటున్నాం.

అమెరికాలో సంచలనాలు సృష్టిస్తున్న ఈగ:
కొందరికి విపరీతంగా నచ్చడంతో పాటు, “క్లాస్ సినిమా”, “మాస్ కు అంతగా నచ్చకపోవచ్చు”, “రిపీటడ్ ఆడియన్స్ వుండరు” అని టాక్ సంపాదించుకున్న రాజమౌళి ‘ఈగ’ అమెరికాలో ఇరగదీస్తుంది. రెండో వారం కూడా ఇదే ఊపు కంటీన్యూ అవుతాది అని ఎక్సపెట్ చేస్తున్నారు. జులాయి వాయిదా పడటం ఆంధ్రలో ఎంత ఎడ్వాంటేజో తెలియదు కాని, అమెరికాలో మాత్రం చాలా పెద్ద ఎడ్వాంటేజ్.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.