శభాష్ బన్నీ!

జులాయి అంతా పూర్తి అయ్యింది. అల్లు అర్జున్ రెండు రీళ్ళు డబ్బింగ్ , సెన్సార్ కార్యక్రమాలు ఈ వారం జరిగి 13న రిలీజ్ కావలసి వుంది. ఈ సినిమాకు నైజాం డిస్టిబ్యుటర్ దాసరి నారాయణ రావు. కచ్చితంగా జూలై 13నే రిలీజ్ చెయ్యడానికి పట్టుపట్టి కూర్చున్నాడంట.

ఈగ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. కాని జులాయి వస్తే, జులాయి కూడా క్లాస్ ను ఆకట్టుకునే అవకాశం వుంది, ఈగ డౌన్ అయ్యే అవకాశం వుందని కొందరు అంచనా వేసారు. సురేష్ బాబు కూడా అదే అంచనా వేసినట్టు వున్నాడు. జులాయి జాప్యం చెయ్యమని అల్లు అరవింద్ ను రిక్వెస్ట్ చేసాడంట.

అల్లు అరవింద్ కు దాసరి నారాయ రావుకు వ్యాపార పరంగా అంత అండర్ స్టాండింగ్ లేదు. జులాయి వ్యాపార వ్యవహారాలలో అల్లు అరవింద్ కు ఎటువంటి సంబంధాలు లేకపోవడం వలన, అల్లు అర్జున్ ను రెండు రీళ్ళ డబ్బింగ్ జాప్యం చేసి, తద్వారా సినిమా రిలీజ్ కూడా లేటు చెయ్యమని చెప్పాడంట.

దాసరి నారాయణ రావు ను రిక్వెస్ట్ చేసే ధైర్యం నిర్మాతలకు లేదు.

మామూలుగా ఎవరికైనా ఇగో అనేది కామన్. ఇగో లేకపోవడం లేదా ఇగోను మన కంట్రోల్ లో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. తన కంటే చిన్న వాళ్ళతో ఎలా వుంటాడో తెలియదు కాని, పబ్లిక్ ఫంక్షన్స్ లో నా అబ్జర్వేషన్ ప్రకారం తన కంటే పెద్ద, గొప్ప అనుకునే వాళ్ళతో ఎటువంటి ఇగో ప్రదర్శించకుండా వారి గొప్పతనాన్ని వెంటనే ఒప్పేసుకుంటాడు బన్నీ.(భవిష్యత్తులో మారిపోవచ్చు)

మాస్ సినిమాలకు భిన్నంగా ‘వేదం’ సినిమా చేసి, ఆ సినిమాను కమర్షియల్ విజయం కోసం ఎంత కష్టపడ్డాడో బన్నికి తెలుసు. ఈగ టాక్ వేదం కంటే బెటర్ గా వున్నా, ఈగ సినిమా బడ్జట్, రెండు సంవత్సరాల రాజమౌళి కాలంతో పోల్చుకుంటే మంచి రెవిన్యూ సాధించాలి. అప్పుడే దర్శక నిర్మాతలు మరిన్ని ఎక్సపరమెంట్స్ చెయ్యడానికి ముందుకు వస్తారు.

SO
జులాయి వాయిదాకు దాసరి నారాయణ రావును ఒప్పించే బాద్యతను బన్నినే తీసుకుని, వాయిదా వెయ్యడం ద్వారా వచ్చే నష్టాన్ని తాను పర్సనల్ గా భరిస్తానని దాసరి నారాయణరావుకు మాట ఇచ్చి సినిమాను పోస్ట్ పోన్ చేయించాడంట.

రాజమౌళి లాంటి హార్డ్ వర్కింగ్ దర్శకుడిని గౌరవించ వలసిన బాద్యత అందరి హీరోలపై వుంది. త్రివిక్రమ్ లాంటి టాప్ క్లాస్ దర్శకుడితో చేసిన సినిమాను చేతిలో పెట్టుకొని, నాకెందుకులే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారని అని చేతులు కట్టుకొని కూర్చోకుండా, రాజమౌళిపై గౌరవాన్ని చేతల్లో చూపించావు. ఈ ఎపిసోడ్ విన్న దగ్గర నుండి బన్నీపై గౌరవం పెరిగింది. శభాష్ బన్నీ!

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.