‘జులాయి’ ప్రమోషన్ కోసం జులాయిలు షూటింగ్ పార్ట్ పూర్తి

జులాయిలు షూటింగ్ పార్ట్ పూర్తి : (July 30, 2012)
——————————-
నాలుగు రోజులు పాటు కష్టపడి బన్ని ‘జులాయి’ ప్రమోషన్ కోసం pawanfans.com ‘జులాయిలు’ ఫినిష్ చేసాం. షార్ట్ ఫిలింలో కనిపించే ఆర్టిస్టులు కాకుండా తెర వెనుక కష్టపడిన వాళ్ళ గురుంచి వింటుంటే సినిమాపై ఇంత పిచ్చి వుందా అనిపించింది. ఐదుగురు అసిస్టెంట్ డైరక్టర్స్ టీమ్ తో పాటు, రామ్ మోహన్, హేమంత్, సతీష్, సాయి రాజేష్ లు అందించిన సహాయంతోనే ఈ షార్ట్ ఫిలిం అందించగల్గాము. కెమెరా మేన్ ‘రాజు’ వలనే ఇంత అందంగా తీయగల్గాము అంటున్నాడు దర్శకుడు. విశేషాలు ఫోన్ లో వినడటమే కాని, నేను వాళ్ళు పడిన కష్టం .. అవుట్ పుట్ నేను చూడలేదు కాబట్టి .. వాళ్లు చెప్పింది తప్ప, ఎక్కువ మాట్లాడలేను. pawanfans.com జులాయిలు బన్ని ‘జులాయి’ కోసం మరింత వెయిట్ చేసేలా సినిమా పిచ్చోళ్ళలో యూత్ లో ఉత్సుకత క్రియేట్ చేస్తుందని ఆశీస్తున్నాం. మూడు రోజులు సౌండ్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, రీకార్డింగ్ వర్క్ ఫినిష్ చేసి శుక్రవారం August 3న రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం.

జులాయిలు ప్రొగ్రస్ రిపోర్ట్ – 95% complete: (July 29, 2012)
——————————————
ఈరోజు జులాయిలు షూటింగ్ అంతా సెట్ లోనే. సో ఈరోజు 75% చేసాము. మొత్తం 95% complete అయ్యింది. మిగిలిన 5%, రేపు అవుట్ డోర్ లో ఫినిష్ చెయ్యాలి. శుక్రవారం ఆగష్టు 3 డేట్ రీచ్ అవ్వగలం అని అనుకుంటున్నాం. బన్ని జులాయి ప్రమోషన్ కోసం జులాయిలు చెయ్యడం చాలా ఆనందంగా వుంది. చాలా ఖర్చు పెట్టాం. ఖర్చు కంటే ఎక్కువ , పులిచెర్ల దర్శకత్వంలో జులాయిలు టీం మొత్తం పడిన కష్టం అంతా ఇంతా కాదు. మా కష్టం జులాయి సినిమాకు కొద్దిగా ఉపయోగ పడినా చాలు.

జులాయిలు ప్రొగ్రస్ రిపోర్ట్ – 20% complete: (July 28, 2012)
——————————————
ఆగష్టు 9న రిలీజ్ కాబోతున్న బన్ని ‘జులాయి’ సినిమా ప్రమోషన్ కోసం pawanfans.com creative works నిర్మిస్తున్న ‘జులాయిలు’ షార్ట్ ఫిలిం షూటింగ్ 20% పూర్తి చేసుకుంది. రెండు రోజుల షూటింగ్ సమయంలో 20% మాత్రమే కావడానికి కారణం, ఇప్పటి వరకు షూట్ చేసింది అంతా అవుట్ డోర్. మిగిలిన 80% అంతా ఇండోర్. రెండు రోజుల్లో ఫినిష్ చేస్తాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మంగళ, బుధ, గురువారం, మూడు రోజుల్లో ఫినిష్ చేసి ఎటువంటి పరిస్థితులలోను ఆగష్టు 3న జులాయిలు రిలీజ్ చెయ్యాలనుకుంటున్నాం .

జులాయిలు short film duration: 20 minutes

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.