జులాయి సినిమాతో మెగాహిరోలు హ్యాట్రిక్ సాధిస్తారా?

హీరోలకు తమ ప్రతి సినిమా ఒక అనుభవం. హిట్టా ఫట్టా అనేది సెకండరీ, ఎందుకంటే సినిమాలు అనుకున్న రేంజ్ చేరుకోపోతే కూడా ఫ్లాప్ గా పరిగణిస్తున్నారు. బన్ని దేశముదురు సినిమాలు మాస్ కు దగ్గర చేస్తే, హ్యాపీ ఆర్య2 వేదం సినిమాలు క్లాస్ దగ్గరకు చేసాయి. బద్రినాథ్ ఫ్లాప్ అయినా, బన్ని డాన్సస్ బాగా ఆకట్టుకున్నాయి. కానీ ‘ఆర్య’ తర్వాత ఆ రేంజ్ లో అన్ని వర్గ ప్రేక్షకులలో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా బన్నికి లేదు. ఆర్య రేంజ్ లో హిట్ లేకపోయినా, బన్ని నటుడిగానే కాకుండా కమర్షియల్ హిరోగా కూడా సినిమా సినిమాకు బాగా ఎదిగాడు. ప్రస్తుత యువ హీరోలలో మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ స్టైలిష్ హీరోగా పేరు సంపాదించాడు కూడా.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా పూర్తి స్థాయిలో కమర్షియల్ విజయం సాధించక పోయినా, ఆయన డైలాగ్స్ ఒక బ్రాండ్. డైలాగ్స్ లో ఆయనను అనుకరించని ప్రభావం లేని ఈ తరం రచయితలు వుండరంటే అతిశయోక్తి కాదు. ఏ ఆర్టిస్టు అయినా ఆయన దర్శకత్వంలో నటించడం ఒక అదృష్టంగా భావిస్తారు. క్వాలిటి కొసం భారీగా వేస్ట్ చేస్తాడని పేరు వున్నా, ఆయన నిర్మాతలను వెతుక్కోవలసిన పని లేదు. ఆయన హీరోలే నిర్మాతలను సెట్ చేస్తారు. రికార్డుల కోసం ప్రతి హిరో అభిమానుల మోస్ట్ వాంటెండ్ డైరక్టర్ రాజమౌళి అయితే, ఆ హిరోల మోస్ట్ వాంటెండ్ డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.

రచ్చ , గబ్బర్ సింగ్ సినిమాలతో మంచి ఊపు మీద మెగా హీరోలు జులాయితో కమర్షియల్ హిట్స్ హ్యాట్రిక్ సాధిస్తారో లేదో తెలియాలంటే ఆగష్టు9 దాకా ఆగాల్సిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.