ఈరోజే ‘జులాయిలు’ విడుదల

‘పబ్లిక్ కింగ్’ తో మా దిశ మారింది. ‘పబ్లిక్ కింగ్’ ఇచ్చిన ఉత్సాహంతో మెగా సినిమాల ప్రమోషన్ కోసం మా వంతుగా చిన్న చిన్న ప్రయత్నాలు చెయ్యాలని నిర్ణయించుకున్నాం. మెగా హీరోల మీద అభిమానం, సినిమాలంటే పిచ్చి, మోజుతో సరదాగా చేస్తున్న ప్రయత్నాలను మీ విజిట్స్, మీ true కామెంట్స్ తో మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశీస్తున్నాం.

జులాయి ప్రమోషన్ కోసం మేము అత్యంత భారీగా నిర్మించిన జులాయిలు షార్ట్ ఫిలిం ఈరోజే విడుదల అవుతుంది. బన్ని జులాయి కథకు మా జులాయిలకు సంబంధం ఏమి లేదు. కాని జులాయిని దృష్టిలో పెట్టుకొని జులాయి ప్రమోషన్ కోసమే చేసిన షార్ట్ ఫిలిం. జులాయి ప్రమోషన్ కోసం ఏ విధంగా ఉపయోగ పడుతుందనేది రిలీజ్ అయితే కాని తెలియదు. చాలా టెన్షన్ గా వుంది.

బన్ని & త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో జరిగే ఈ కథకు బన్ని & త్రివిక్రమ్ వాయిస్ పెండింగ్ వుంది. టెంపరరీగా ఒక వాయిస్ పెట్టాము. ఈరోజు పగలు మరింత మెరుగైన వాయిస్ తో((మిమిక్రి ఆర్టిస్ట్)) రిప్లేస్ చేసి ఈరోజు నైట్ రిలీజ్ చేస్తాం. ఫస్ట్ కాపీ ఒక ప్రముఖ దర్శకుడికి చూపించి సలహాలు తీసుకుంటాము. చిన్న చిన్న మార్పులు సజెస్ట్ చేస్తే అవి కూడా ఈరోజు పగలు ఫినిష్ చేస్తాం.

1) ఈ షార్ట్ ఫిలింలో నటించిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే.
2) ఎడిటింగ్ చేసినతను బాగా చేసాడంట.
3) కెమెరా మేన్ టూ గుడ్.
4) షార్ట్ ఫిలిమ్స్ లో అత్యంత భారీ షార్ట్ ఫిలిం. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా వుంటాయి.నలభై మంది యూనిట్ తో 5 రోజులు పాటు షూటింగ్ చేసాం.
5) ఈ ప్రొజెక్ట్ కు కెప్టెన్ ‘పులిచెర్ల’. పది రోజులు పైగా రేయింబవళ్ళు కష్టపడ్డాడు.
6) ఒక ఫ్రెండ్ మీ హడావుడి షార్ట్ ఫిలింలా లేదు. 20 నిమిషాల సినిమాలా వుంది అని అన్నాడు.

7) Thanks to బన్ని, దాసరి గారు అండ్ రాజమౌలి గారు. ఈగ కోసం జులాయి నెల రోజులు పోస్ట్ పోన్ చెయ్యడం వలనే జులాయిలు షార్ట్ ఫిలిం చేయగల్గాము.

బన్ని & త్రివిక్రమ్ వాయిస్ ఓవర్ తో జులాయిలు కథ నడుస్తాది. ఏడుగురు జులాయిల పవర్ చూపించడానికి ప్రయత్నం చేసాం. Please encourage us by watching the short film and posting your true comments. మీకు నచ్చితే తప్పకుండా, ఇంకో పదిమందికి చూపించండి.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.