జులాయి లేటు అవ్వడం మంచిదయ్యింది

జులాయి ప్రమోషన్ కోసం మేము చేసిన జలాయిలు షార్ట్ ఫిలిం, టార్గెట్ యూత్ కు రీచ్ అవ్వలేదని నిరుత్సాహం కలిగింది. మా తప్పులేమిటొ తెలుసుకున్నాం. ఐదుగురు కొత్త యాక్టర్స్ ను పరిచయం చేసామన్న తృప్తి మాత్రం వుంది. మేము చేసిన ‘ఓ మధు .. ఓ మధు ..’ సాంగ్ మాత్రం కేక. అసలు సినిమాలో ఫుల్ సాంగ్ సిట్యువేషన్ అండ్ పిక్చరైజేషన్ వెయ్యి కళ్ళతో వెయిటింగ్.

జులాయి లేటు అవ్వడం మంచిదయ్యింది:
జులాయి జూలైలో కాకుండా ఆగష్టులో రిలీజ్ అవ్వడానికి కారణం బన్ని. రాజమౌలి రెండు సంవత్సరాల కష్టం మీద గౌరవంతో బన్ని తన జులాయి సినిమాను ఒక నెల పోస్ట్ పోన్ చేయించడం వలన, అటు ఈగ రెండో వారం కలక్షన్స్ డ్రాప్ కాలేదు. అంతే కాదు జులాయి లేటు అవ్వడం జులాయికి కూడా మంచిదయ్యింది. మొదటి రోజు ఎవరేజ్ గా అనిపించిన సాంగ్స్, ఇప్పుడు ప్రేక్షకుల నోట్లో బాగా నానుతున్నాయి. ట్రైలర్స్ కూడా మంచి మూడ్ ను సెట్ చేసాయి.

సినిమా మినిమమ్ గ్యారంటీ. బన్ని, ఇలియానా జోడి ప్రేక్షకులకు బాగుందనిపిస్తే మెగా అభిమానులు ఆశీస్తున్న హ్యాట్రిక్ కొట్టిసినట్టే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.