జులాయి – exclusive review

ఇది ఎవరి సినిమా?
ఇది పూర్తిగా త్రివిక్రమ్ సినిమా.

అంటే బన్ని డమ్మీనా?
సినిమా అంటే passion తో పాటు, బన్నీకి ఉన్నటువంటి strengths ను కరెక్ట్ గా వాడుకొని ఒక మంచి సినిమా తీయగల సత్తా వున్న దర్శకుడిని పూర్తిగా నమ్మి, ఫుల్ ఫ్రీడం ఇచ్చి .. బన్నీ చాలా రిలాక్సడ్ గా చేసిన సినిమా. డైలాగ్స్ చెప్పడం, కామెడీ, సీరియస్ నెస్ .. ఇలా ప్రతి కోణంలో చించి చేట చేసాడు.

సాంగ్స్ ఎలా వున్నాయి?
1) ‘గబ్బర్ సింగ్’ మూడ్ లో వుండటం వలన 2) సింగర్స్ వాయిస్ కొత్తగా వుండటం వలన 3) లిరిక్స్ సంభాషణలు మాదిరి వుండటం వలన .. మొదట్లో సాంగ్స్ ఎవరేజ్ అనిపించాయి. సినిమా లేటు అవ్వడం వలన సాంగ్స్ విని విని బాగా ఎక్కేసాయి. స్క్రీన్ మీద త్రివిక్రమ్ విజువల్స్ కు బన్ని స్టెప్స్ తోడయ్యి ఇరగదిసేసాయి. లాస్ట్ సాంగ్ లో ఎ.యన్.ఆర్, కృష్ణ , పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చెయ్యడం సూపర్.

ఇలియానా ఎలా చేసింది?
బన్ని ఇలియానా జోడి బాగానే వుంది. ఇలియానా స్కోప్ తక్కువ అయినా బాగానే చేసింది. సినిమా ఎండింగ్ ఇలియానాతో కాకుండా .. తండ్రితో వుండటం వలన చివరికి మెసేజ్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది.

రాజేంద్ర ప్రసాద్ ఎలా చేసాడు?
ఇంత పెద్ద రోల్ రావడం నిజంగా అదృష్టం. చాలా బాగా సెట్ అయ్యాడు. రావు రమేష్ కూడా. విలన్ సోనుసూద్ కొన్ని సీన్స్ లో ‘రఘువరన్’ లా అనిపించాడు.

బ్రహ్మానందం, యం.యస్, అలీ .. ఎలా చేసారు?
వీళ్ళ డామినేషన్ లేదు. ఉన్నంతలో కామెడీ బాగా చేసారు.

సినిమా ఏమి నచ్చ లేదు? ఏమి మిస్ అయ్యింది?
పకడ్భందీగా తీసిన సినిమా .ఇది బాగోలేదు .. ఇది అనవసరంగా వుంది అనిపించే సీన్లు ఏమి లేవు. ఎమోషన్(హృదయానికి హత్తుకునే సీన్స్) మిస్ అయినట్టు అనిపించింది.

క్లాస్ కు బాగా నచ్చే సినిమా. మాస్ కు నచ్చే చాన్సస్ పుష్కలంగా వున్నాయి. రిపీటడ్ ఆడియెన్స్ వుండే సినిమానే. లేడిస్ తో పాటు పిల్లలకు కూడా బాగా నచ్చే సినిమా.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.