పూరి జగన్నాథ్ అంటే భయపడుతున్న పవన్ ఫ్యాన్స్

దూకుడు సినిమాతో మహేష్ బాబు సంపాదించిన ఇమేజ్ పరఫెక్ట్ ఫాలో అప్ మూవీగా పూరి జగన్నాథ్ ‘బిజినెస్ మెన్’ రావడం జరిగింది. ఆ క్రేజ్ కు తెలుగు బిగ్గెస్ట్ ఫెస్టివల్ సీజన్ సంక్రాంతి తోడయ్యింది. ఆ సమయంలో వేరే బిగ్ సినిమాలు లేకపోవడం లేదా అండర్ స్టాండింగ్ తో హయస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేసి, రికార్డ్ బ్రేకింగ్ ఓపినింగ్స్ సాధించారు.

ఈ విధంగా రిలీజ్ చేస్తే జనాలు చూసేయరు.. సినిమాలో విషయం కూడా వుండాలి. ఆవేశంతో మొదటి వారంలో చూసే ప్రేక్షకులకు కావలసిన కంటెంట్ ‘బిజినెస్ మెన్’ సినిమాలో వుంది.

ప్రస్తుతం నిర్మాణంలో వున్న పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ కూడా ‘బిజినెస్ మెన్’ మాదిరి ఓపినింగ్స్ సాధించే సినిమాగా వుంటే చాలు అని ఒక అభిమాన వర్గం కోరుకుంటుంది.

‘దేవుడు చేసిన మనుషులు’ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ అభిమాన వర్గం మాత్రం పూరి జగన్నాథ్ అంటే భయపడుతున్నారు.

ఈ భయం కొత్త కాదు, ‘గబ్బర్ సింగ్’ సినిమాపై కూడా కొందరు అభిమానులకు అనుమానాలు వుండేవి. హరీష్ శంకర్ ట్విటర్ లో చేసే హడావుడిని మొదట్లో ఎవరూ నమ్మలేదు. టీజర్, ట్రైలర్, ఆడియో .. ఇలా ఒక్కటొక్కటి సినిమాపై మంచి హైప్ తీసుకోచ్చాయి.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాపై అనుమానాలతో పాటు అంచనాలు కూడా బాగానే వున్నాయి. హైప్ మాత్రం ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏ విధంగా హైప్ క్రియేట్ అవుతుంది, హైప్ కు తగ్గట్టుగా వుంటుందా, ఏ రేంజ్ హిట్ అవుతుందో తెలియాలి అంటే .. అక్టోబర్ 11 వరకు ఆగాల్సిందే.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.