పబ్లిసిటి మొదలుపెట్టిన పూరి జగన్నాథ్

సినిమాలో సాంగ్స్ సిట్యువేషన్ పరంగా వచ్చి ఆ సాంగ్ సినిమాలో భాగమైతేనే పవన్ కళ్యాణ్ మనసు పెట్టి చేస్తాడని, ఏదో సాంగ్ కోసం సాంగ్ అన్నట్టు చెయ్యమంటే ఆ ఫిల్ తో చెయ్యలేడని హరీష్ శంకర్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ కు ఇంకో రూల్ కూడా వుంది. సినిమా గురుంచి సినిమా రిలీజ్ కు ముందు అసలు మాట్లాడక పోవడం. సినిమా గురుంచి సినిమా మాట్లాడలని నమ్ముతాడు.

కాని నిర్మాతకు , బయ్యర్సకు సినిమాపై ఎంత ఎక్కువ హైప్ క్రియేట్ అయితే అంత భారీ ఓపినింగ్స్ వస్తాయి కాబట్టి, పవన్ కళ్యాణ్ మాట్లాడక పోయినా ఏదో రకంగా హైప్ క్రియేట్ చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తుంటారు.

పంజా నిర్మాతలు ఫ్యాన్స్ ను కూడా ప్రి రిలీజ్ పబ్లిసిటిలో భాగం చేసి హైప్ చెయ్యడంలో సక్సస్ అయ్యారు. సినిమా హైప్ కు తగ్గట్టుగా నిలబడలేక పోయింది. డీలా పడిన కొందరు ఫ్యాన్స్, సినిమా రిలీజ్ కు ముందు దర్శక నిర్మాతల మాటలు నమ్మకూడదని నిర్ణయించుకున్నారు. హరీష్ శంకర్ కూడా సినిమా మొదలయిన దగ్గర నుండి హైప్ కోసం ట్రై చేసాడు కాని, టీజర్ వచ్చే దాకా అతని మాటలు ఎవరూ నమ్మలేదు. గబ్బర్ సింగ్ ఆడియో .. ట్రైలర్స్ .. వలన సినిమాపై హైప్ ఒక రేంజ్ లో వచ్చింది.

ఇప్పుడు పూరి వంతు మొదలైంది. ఫ్యాన్స్ కు ఆడియో పాస్ లు ఆశ చూపుతూ హైప్ చెయ్యడం మొదలు పెట్టాడు. రోజుకో ప్రశ్న/ప్రశ్నలు పేస్ బుక్ పేజిలో పోస్ట్ చేస్తానని, వాటిని ఆన్సర్ చేసిన మొదటి వ్యక్తికి రోజుకో ఒక ఆడియో పాస్ తో, లక్కి డ్రాలో విన్ అయిన ఒక ఫ్యాన్ కు ఆడియో ఫంక్షన్ లో స్పెషల్ ట్రీట్ మెంట్ కూడా ఇస్తానని అంటున్నాడు.

భారీ ఓపినింగ్స్ కోసం సినిమా హైప్ మీద దృష్టి సారించడంలో పాటు, సినిమా ఇలా వుండబోతుందని రాజమౌళి తరహాలో సినిమాకు రైట్ పబ్లిసిటి కూడా చేసి ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తారని ఆశీద్దాం.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.