టాప్ నలుగురు హిరోలలో అల్లు అర్జున్

idlebrain jeevi ‏@idlebrainjeevi
Julayi to join 40 crore club. Bunny is 4th Telugu hero and 3rd mega hero to do so

ఏ కలక్షన్స్ నిజం? అనేది చెప్పడం కష్టం. ఎందుకంటే ఫ్లాప్ సినిమాలు కూడా, పబ్లిసిటి కోసం మా సినిమా ఇంత కలక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందని ఉదర గొట్టేస్తారు.అలా చెయ్యడం వలన కలక్షన్స్ ఏమైనా పెరుగుతాయో ఏమో తెలియదు కాని, నిజంగా కలెక్ట్ చేసినా ఎవరూ నమ్మరు.

జులాయి సినిమా, అల్లు అర్జున్, త్రివిక్రమ్ 40 కోట్ల క్లబ్ లో చేరారో లేదో తెలియదు కాని .. పబ్లిక్ లో ‘జులాయి’ సూపర్ హిట్ సినిమా అనిపించుకుంది.

తెలుగు సినిమాల మార్కెట్ అనూహ్య రీతిలో పెరిగింది. సినిమా హిట్ టాక్ వస్తే బయ్యర్లకు పండగే పండగ. హిట్ , పైసా వసూల్ అనే టాక్ తో మొదలైన జులాయి సూపర్ హిట్ దిశగా సూపర్ కలక్షన్స్ సాధిస్తుంది.

రచ్చ మరియు గబ్బర్ సింగ్ మెగా సినిమాల తర్వాత వచ్చిన మరో మెగా సినిమా జులాయి కూడా బయ్యర్లకు కనక వర్షం కురిపించడంతో మెగా శిబిరాలలో ఆనందోత్సవాలు పెల్లుబోకుతున్నాయి. అంతే కాదు అల్లు అర్జున్ ను టాప్ నాలుగు హిరోలలో చేర్చేసింది.

రామ్ చరణ్ – మగధీర & రచ్చ
మహేష్ బాబు – దూకుడు & బిజినెస్ మెన్
పవన్ కళ్యాణ్ – గబ్బర్ సింగ్
అల్లు అర్జున్ – జులాయి

Congrats to Allu Arjun.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.