పూరి జగన్నాథ్ C/O Quick Money

వేగంగా సినిమాను తీసి నిర్మాతకు అప్పగించడం ఎంత ముఖ్యమో .. ఆ సినిమాలో ఆసక్తికర కథ, కథనాలు ఉండేలా చూసుకోవడమూ దర్శకుడి బాధ్యతే. – మీను (ఈనాడు సినిమా రివ్యూర్)

నిర్మాత: పెద్ద నిర్మాతలందరూ హిరో, దర్శకుల అండతో వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఒక సినిమాలో నష్టం వస్తే ఇంకో సినిమా. ఆయా హిరో దర్శకులు మరో సినిమా చేసి పెడతారు కాబట్టి, పెద్దగా నష్టబోయేది వుండదు.

బయ్యర్లు: సినిమా కొనడం అంటే గ్యాబ్లింగ్. రూపాయికి రూపాయి రావచ్చు . మొత్తానికి రూపాయి పోనూవచ్చు . చిన్న నిర్మాతల పరిస్థితి కూడా ఇంతే. లాభాల మాట ఎలా వున్నా, ఎక్కువ నష్ట పోయేది వీళ్ళే.

ప్రేక్షకులు: వీరి పెట్టుబడి తక్కువే మరియు టాక్ తెలుసుకొని సినిమాకు వెళ్ళే వెసులబాటు వుంది కాబట్టి, వీరు పెద్ద నష్ట బోయేది ఏమి వుండదు. ఆర్దికంగా వీరి గురించి అంత వర్రీ కానక్కర్లేదు.

అభిమానులు: వంద కాదు, రెండు వందలు సినిమా టిక్కెట్టు పెట్టినా మొదటి రోజు చూడాల్సిందే. సినిమా హిట్ అయితే కాలర్ ఎగర వెయ్యడం. సినిమా ఫ్లాప్ అయితే మీ హిట్ సినిమా కంటే మా ఫ్లాప్ సినిమా కలక్షన్స్ ఎక్కువ అని ప్రత్యర్ది అభిమానులతో వాదించడం. ఇదే టైంపాస్.

పూరి జగన్నాథ్:
ఒక సినిమా రెండు సంవత్సరాలు కష్టపడి ముపై నలభై కోట్లు పెట్టి తీసినా హిట్ అవుతుందని గ్యారంటి ఏమి లేదు. సో అతి తక్కువ కాలంలో సినిమా చుట్టేయ గల నేర్పరి పూరి జగన్నాథ్. తక్కువ కాలం అంటే కచ్చితంగా తక్కువే ఖర్చే. మినిమం గ్యారంటి ఏమి వుండదు. క్లిక్ అయితే మాత్రం కాసుల వర్షమే. కాలం కలిసొస్తే. పూరి జగన్నాథ్ C/O Quick Money.

పూరి జగన్నాథ్ సినిమా అంటే 1) బయ్యర్లు ఆవేశపడి ఎక్కువకు కొనకూడదు. 2) అభిమానులు సినిమా రిలీజ్ కు ముందే తొడకొట్ట కూడదు.

‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ – పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి సినిమాపై అంచనాలను ఆపడం ఎవరి తరం కాదు. పొరబాటున అంచనాలు రీచ్ అయితే అభిమానులకు పండగే.

పబ్లిక్ టాక్ ఎలా వున్నా, పూరి జగన్నాథ్ సినిమాలంటే నాకిష్టం. Waiting a lot for ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ .

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.