‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ఓవర్ సీస్ సినిమా టిక్కెట్టు రేట్లు

మా సినిమా ఇంత చేసింది .. అంత చేసిందని అని సినిమా పబ్లిసిటికి మాత్రమే పరిమితం చెయ్యకుండా ,
అభిమానులను రెచ్చ గొడుతూ పబ్లిక్ గా దూకుడు నిర్మాతలు రోడ్లు ఎక్కుతుంటే ..
అలా కాదు ఇలా వుండాలని ‘గబ్బర్ సింగ్’ నిర్మాత ద్వారా
సినిమా హిట్ అయితే ఇలా వుండాలని పవన్ కళ్యాణ్ చూపించాడు.

హిట్ సినిమాకు టిక్కెట్టు రేటుతో పెద్దగా పని వుండదు.

ఎవరేజ్ అండ్ బిలో ఎవేరేజ్ సినిమాకు కూడా:
ఓవర్ సీస్ లో టిక్కెట్టు రేట్లు మొదటి వారం మరీ ఎక్కువగా పెట్టడం వలన, కలక్షన్స్ తగ్గక పొయినా చూసే వాళ్ళు తగ్గుతున్నారు. భారమంతా అభిమానులు, సినిమా పిచ్చోళ్ళ మీదే పడుతుంది.

“హర్రర్ సినిమాలు చూస్తుంటే భయమేస్తుందని చూడటం మానేస్తామా? .. వీడు అంతే.” జులాయి సినిమాలో అల్లు అర్జున్ గురుంచి ఎం.యస్ నారాయణ చెప్పే డైలాగ్ అది. ఆ టైపులో అయిపోయింది అభిమానుల పరిస్థితి. టిక్కెట్టు రేటు ఎక్కువ అని చూడకుండా వుండలేరు.

ఓవర్ సీస్ లో సినిమాలు చూసే జనాల సంఖ్య అనుహ్యంగా పెరిగింది. కాని అది హిట్ సినిమాలకే పరిమితం అవుతుంది. ఆ సంఖ్య ఎవరేజ్ అండ్ బిలో ఎవేరేజ్ సినిమాలకు కూడా మెయింటేన్ చెయ్యాలంటే పెద్ద సినిమాల టిక్కెట్టు రేట్లు తగ్గించాలి. అమెరికాలో Adult $10 , Child $6. ‘కెమరామెన్ గంగతో రాంబాబు’ కు పెడితే చూసే వాళ్ళ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.