జానీ సినిమాను గుర్తుకు తెస్తున్న ‘రాంబాబు’

before ‘తీన్ మార్’: పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ‘ఏదో కొత్తదనం’ వుంటుందని ఆశ. తీరా వచ్చాక నిరాశ.

‘తీన్ మార్’ లో పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూసాక, హమ్మయ్య ‘పవన్ కళ్యాణ్’ సినిమాలపై దృష్టి సారిస్తున్నాడు.. అది చాలు అనిపించింది. కాని పంజా చూసాక, పవన్ కళ్యాణ్ తో చెయ్యడానికి ఎంతో ఆసక్తితో వున్న మన తెలుగు దర్శకులను కాదని పవన్ కళ్యాణ్ స్టామినా, స్ట్రేంత్ తెలియని తమిళ్ దర్శకులకు అవకాశం ఇవ్వడం ఏమిటి అని బాదేసింది.(ఒకప్పుడు కథలో దమ్ము చూసి తమిళ్ దర్శకులకు అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్, కథను పక్కన పెట్టి కేవలం పంజా దర్శకుడి ఉత్సాహం చూసి అతనితో పని చేసాడు.)

‘గబ్బర్ సింగ్’ – రీమేక్ కు అర్ధం మార్చేసిన పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమా గుర్తు వచ్చింది.

తమ్ముడు తర్వాత పూరి జగన్నాథ్ ‘బద్రి’. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పూరి జగన్నాథ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’. అనిపిస్తుంది. కాని ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమా బిజినెస్ వార్తలు చదువుతుంటే ఖుషి తర్వాత జానీ సినిమా గుర్తుకు వస్తుంది.

ఈ సినిమా మెసేజ్ ఓరింటడ్,
పూరి ఎలా తీస్తాడో,
సినిమా ఏమవుతుందో అనే భయం వున్నా,
తన సినిమాలలో అభిమానుల కోసం అభిమానులు మెచ్చే డైలాగ్స్ చెపుతున్న పవన్ కళ్యాణ్ ,
ఈ సినిమాలో అభిమానుల కోసం అభిమానులు మెచ్చే డాన్సస్ కూడా చేసాడని వినికిడి,
సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకొని వెళ్లి పోతుంది.

ప్రకటనలు

About a2zdreams

No Rules .. No Restrictions ..
This entry was posted in సినిమా, Xclusive. Bookmark the permalink.